Indian Railways Update: రైల్వే ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన- ఏం చెప్పిందంటే?
రైల్వేపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరణ చేయబోమని తేల్చిచెప్పింది.
ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు ముందుకేస్తోన్న మోదీ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరణ చేయబోమని రాజ్యసభ వేదికగా ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మేరకు సభలో తెలిపారు.
No privatisation of Railways: Railway Minister Ashwini Vaishnaw says in Rajya Sabha pic.twitter.com/e86rvxbQha
— ANI (@ANI) March 24, 2022
క్లారిటీ వచ్చిందా?
ఇటీవల లోక్‌సభలో రైల్వేశాఖ గ్రాంట్స్‌పై జరిగిన చర్చ సందర్భంగా కూడా అశ్విని వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు.రవాణా రైళ్లను ప్రైవేట్‌పరం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. రవాణా రైళ్లను ప్రైవేటీకరించడం లేదన్నారు. రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీ వేగంగా జరుగుతోందని, తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 3 లక్షల రైల్వే ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
రైల్వే రిక్రూట్మెంట్‌పై ఎక్కడా బ్యాన్ విధించలేదన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీలు భారతీయ రైల్వేకు భద్రతా సర్టిఫికేట్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
మానిటైజేషన్ పైప్‌లైన్
విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణపై ముందుకు వెళ్తోంది. ఇందుకోసం గతేడాది ఆగస్టులో జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా పర్యవేక్షణ లోపించిన పలు ఆస్తులను ప్రైవేటీకరణ చేసి నగదుగా మార్చనున్నారు.
Also Read: Hijab Row: 'హిజాబ్' అంశాన్ని సంచలనం చేయొద్దు- అత్యవసర విచారణకు సుప్రీం నో
Also Read: Ukraine Russia War: అణ్వాయుధాల వినియోగంపై రష్యా సంచలన వ్యాఖ్యలు- అమెరికా సీరియస్