Hijab Row: 'హిజాబ్' అంశాన్ని సంచలనం చేయొద్దు- అత్యవసర విచారణకు సుప్రీం నో
హిజాబ్‌పై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు మరోసారి నిరాకరించింది. ఈ అంశాన్ని సంచలనం చేయొద్దని విజ్ఞప్తి చేసింది.
విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించరాదని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు మరోసారి నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపే తేదీని ప్రకటించేందుకు నో చెప్పింది. ఈ అంశాన్ని సంచలనం చేయొద్దని సుప్రీం అభిప్రాయపడింది.
హైకోర్టు తీర్పు
కొన్ని నెలలకు ముందు కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు స్వీకరించింది. అయితే అత్యవసర విచారణకు మాత్రం అంగీకరించలేదు. హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో అత్యవసర విచారణ జరపాలని సుప్రీం కోర్టులో మరో పిటిషన్ రాగా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది
మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేశారు. దీంతో ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.
Also Read: Viral News: పిల్లి చేసిన లొల్లి- ఒకటి, రెండు కాదు రూ.100 కోట్ల నష్టం, ఇంకేంటంటే?