By: ABP Desam | Updated at : 24 Mar 2022 04:01 PM (IST)
Edited By: Murali Krishna
అణ్వాయుధాల వినియోగంపై రష్యా సంచలన వ్యాఖ్యలు- అమెరికా సీరియస్
అణ్వాయుధాల వినియోగంపై రష్యా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ మనుగడకు ముప్పు వాటిల్లితే అణ్వాయుధ వినియోగానికి కూడా సిద్ధంగా ఉన్నామని రష్యా హెచ్చరికలు చేసింది. అమెరికాకు చెందిన సీఎన్‌ఎన్‌కు ఇచ్చి ఓ ఇంటర్వ్యూలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"పుతిన్ అణ్వాయుధాల వినియోగానికి అనుమతించరని మీరు నమ్ముతున్నారా?" అని అడిగిన ప్రశ్నకు దిమిత్రి ఇలా బదులిచ్చారు.
గుర్రుగా అమెరికా
రష్యా చేసిన ప్రకటనపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. దిమిత్రి చేసిన వ్యాఖ్యలపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మండిపడ్డారు.
రష్యాకు నష్టం
యుద్ధంలో ఉక్రెయిన్ నష్టం గురించే అందరూ మాట్లాడుతున్నారు. కానీ రష్యాకు ఏ మేర నష్టం కలిగిందో క్రెమ్లిన్ పూర్తిగా చెప్పడం లేదు. అయితే నాటో అధికారి ఒకరు మాత్రం.. నాలుగు వారాల్లో రష్యాకు చెందిన 7 వేల నుంచి 15 వేల మంది సైనికులు మృతి చెంది ఉంటారని తెలిపారు. మరో 30 వేలన నుంచి 40 వేల మంది సైనికులకు గాయాలు కావడం, బందీలుగా దొరకడం, కనపడకుండా పోవడం వంటివి జరిగి ఉంటాయని వెల్లడించారు.
మరోవైపు ఈ యుద్ధంలో 2,500 మంది వరకు పౌరులు మృతి చెంది ఉంటారని ఐరాస తెలిపింది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ లాంటి నగరాలు ధ్వంసమయ్యాయి. దక్షిణ నగరమైన మరియూపోల్‌ను కూడా రష్యా బలగాలు ముట్టడించాయి.
Also Read: Viral News: పిల్లి చేసిన లొల్లి- ఒకటి, రెండు కాదు రూ.100 కోట్ల నష్టం, ఇంకేంటంటే?
Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
Umbrella Costs 1 Lakh : ఆ గొడుగు ధర అక్షరాలా లక్ష - వర్షంలో బయటకు తీసుకెళ్లారో తడిచిపోతారంతే !
Elon Musk Political Views: ట్రంప్ అంటే మస్క్ మామకి ఎందుకింత లవ్?
Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!
Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి