Maoist Encounter In Balaghat: ఆ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్- ముగ్గురు నక్సల్ మృతి, రివార్డ్ ఎంతో తెలుసా?
Maoist Encounter In Balaghat: మధ్యప్రదేశ్- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు.
Maoist Encounter In Balaghat: మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు-నక్సల్స్ మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఇందులో ఒకరు టాప్ నక్సల్‌గా పోలీసులు గుర్తించారు.
ఇదీ జరిగింది
సరిహద్దుల్లో నక్సల్స్ నక్కి ఉన్నారన్న సమాచారంలో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. పోలీసులను గమనించిన నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మరణించారు.
మృతుల్లో డివిజనల్ కమిటీ సభ్యుడు నగేశ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డివిజనల్ కమిటీ సభ్యుడు, కమాండర్ ఇన్ చీఫ్ స్థాయి నక్సల్ నేత మధ్యప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించడం ఇదే తొలిసారి. ఈ వివరాలను మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ట్విట్టర్‌లో తెలిపారు.
बालाघाट जिले के बहेला थाना इलाके में पुलिस-नक्सली मुठभेड़ में 3 इनामी नक्सली मारे गए हैं।
— Dr Narottam Mishra (@drnarottammisra) June 20, 2022
हॉक फोर्स ने मुठभेड़ में नक्सलियों के डिवीजनल कमेटी के मेंबर और 15 लाख के इनामी नक्सली नागेश और 8-8 लाख के इनामी एरिया कमांडर नक्सली मनोज और रामे को ढेर किया है।
पूरी पुलिस टीम को बधाई। pic.twitter.com/jeO7Cw6HhQ
భారీ రివార్డ్
మృతులపై మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రూ.57 లక్షల రివార్డు ప్రకటించాయి. నగేష్ మీద 15 లక్షల వరకు రివార్డు ఉంది.
Also Read: International Yoga Day 2022: 17 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు- గడ్డ కట్టే చలిలో ఎలా చేశారు భయ్యా!
Also Read: Covid Update: హమ్మయ్యా! దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- 17 మంది మృతి