Covid Update: హమ్మయ్యా! దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- 17 మంది మృతి
Covid Update: దేశంలో కొత్తగా 9,923 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది మృతి చెందారు.
Covid Update: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 9,923 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది మృతి చెందారు. తాజాగా 7,293 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి చేరింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.17 శాతంగా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉంది.
#COVID19 | India reports 9,923 fresh cases, 7,293 recoveries and 17 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 21, 2022
Active cases 79,313
Daily positivity rate 2.55% pic.twitter.com/AcHIh3KVY1
- మొత్తం కరోనా కేసులు: 43,319,396
- మొత్తం మరణాలు: 5,24,890
- యాక్టివ్ కేసులు: 79,313
- మొత్తం రికవరీలు: 4,27,15,193
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 13,00,024 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,32,43,003 కోట్లకు చేరింది. మరో 3,88,641 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది.
Also Read: Modi Speech on Yoga Day: యోగా జీవితంలో భాగం కాదు, జీవన మార్గం: మోదీ - మైసూరులో 15 వేల మందితో ఆసనాలు
Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో మమత బెనర్జీ ప్లాన్ బీ- తెరపైకి బీజేపీ మాజీ నేత