G20తో భారత్ సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలిసింది, ఏడాది పాటు వేడుకలు - మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ
Mann Ki Baat Highlights: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ G20 గురించి ప్రస్తావించారు.
Mann Ki Baat Highlights:
మన్‌కీ బాత్‌లో G20 ప్రస్తావన
ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ (Mann Ki Baat)లో G20 సదస్సు గురించి ప్రస్తావించారు. 105వ ఎపిసోడ్లో మాట్లాడిన ఆయన ఆఫ్రికన్ యూనియన్ని G20లో శాశ్వత సభ్య దేశంగా ఎంపిక చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు India-Middle East-Europe Economic Corridor నిర్మించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలిపారు. మరో ఏడాది పాటు G20 సదస్సుకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించారు. 'G20 University' పేరుతో త్వరలోనే ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. దేశంలోని బడా యూనివర్సిటీల్లో ఈ ఈవెంట్స్ జరిగేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు వివరించారు ప్రధాని మోదీ.
Deep attachment of crores of Indians to Chandrayaan-3. #MannKiBaat pic.twitter.com/SOvynVo9Kq
— PMO India (@PMOIndia) September 24, 2023
ఇదే ఎపిసోడ్లో చంద్రయాన్ 3 సక్సెస్ గురించీ ప్రస్తావించారు. చంద్రయాన్ 3 తరవాత G0 సమ్మిట్ సక్సెస్ అవడం భారత్ సంతోషాన్ని రెట్టింపు చేసిందని అన్నారు. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి మాట్లాడారు. టూరిజం అంటే కేవలం ట్రావెలింగ్ అని మాత్రమే చూస్తామని, కానీ అది ఎంతో మందికి ఉపాధి కల్పించే రంగం అని అభిప్రాయపడ్డారు.
"చంద్రయాన్ 3 విజయం సాధించిన తరవాత G 20 సమ్మిట్ నిర్వహించి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. ఫలితంగా ఇండియా సంతోషం రెట్టింపైంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఈ సందర్భంగా రాజస్థాన్‌కి చెందిన సుఖ్‌దేవ్ జీ టీమ్ కోబ్రాని అభినందించారు ప్రధాని మోదీ. జంతువులను కాపాడేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. పాములు, పావురాలను సంరక్షిస్తున్న చెన్నైకి చెందిన ఆటో డ్రైవర్ రాజేంద్ర ప్రసాద్ ప్రస్తావనా తీసుకొచ్చారు. ఆయనని అభినందించారు.
Various individuals and groups, like Sukhdev Ji's Team Cobra in Rajasthan and auto driver M. Rajendra Prasad Ji in Chennai, are making inspiring efforts towards rescuing and caring for animals, including snakes and pigeons. #MannKiBaat pic.twitter.com/CpDsqwtwz3
— PMO India (@PMOIndia) September 24, 2023
ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ మైదాన నిర్మాణానికి ( international cricket stadium) శంకుస్థాపన చేశారు. ప్రధాని సొంత నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయిలో మైదానాన్ని నిర్మిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు క్రికెట్ లెజెండ్స్ రవి శాస్త్రి, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, దిలీప్ గవాస్కర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రం చెబుతున్న వివరాల ప్రకారం...30 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టేడియం నిర్మించనున్నారు. ఇందుకోసం కేంద్రం రూ.450 కోట్లు ఖర్చు పెడుతోంది. శివుడి స్ఫూర్తితోనే ఈ మైదానాన్ని నిర్మిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. నెలవంక ఆకారంలో రూఫ్ కవర్లు, త్రిశూలం ఆకారంలో ఫ్లడ్ లైట్స్, ఘాట్ స్టెప్స్ ఆకృతిలో సీటింగ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి 30 వేల మంది ఆడియెన్స్ కూర్చుని మ్యాచ్‌ని చూసేందుకు వీలుగా నిర్మించనున్నారు.
Also Read: భారత్ కెనడా వివాదంపై సైలెంట్ మోడ్‌లోకి అమెరికా? అనవసర జోక్యం వద్దనుకుంటోందా?