సర్జికల్ స్ట్రైక్ స్పెషలిస్ట్‌కి మణిపూర్ బాధ్యత, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌కి కీలక పదవి
Manipur Violence: మణిపూర్‌లో హింసను దారికి తీసుకొచ్చేందుకు స్పెషల్ ఆర్మీ ఆఫీసర్‌ని ప్రభుత్వం నియమించింది.
Manipur Violence:
కీలక నిర్ణయం..
మణిపూర్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు మొదలు పెట్టింది. వీలైనంత త్వరగా అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఓ స్పెషల్ ఆర్మీ ఆఫీసర్‌ని రంగంలోకి దింపనుంది. 2015లో మయన్మార్‌లో సర్జికల్ స్ట్రైక్‌ని లీడ్ చేసిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని మణిపూర్ సమస్యను హ్యాండిల్ చేసేందుకు నియమించింది. దాదాపు రెండు నెలలుగా ఆ రాష్ట్రం తగలబడుతూనే ఉంది. ఇప్పటికే 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 24న మణిపూర్ ప్రభుత్వం రిటైర్డ్ కల్నల్ నెక్టార్ సంజెంబం (Nectar Sanjenbam)ని మణిపూర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సీనియర్ సూపరింటెండెంట్‌గా నియమించింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. స్పెషల్ ఫోర్సెస్‌ని లీడ్ చేసిన నెక్టార్...కీర్తి చక్ర అవార్డు గ్రహీత కూడా. ఆ తరవాత శౌర్య చక్ర అవార్డు కూడా పొందారు. మణిపూర్ హోం శాఖ నెక్టార్‌ని సీనియర్ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 12న కేబినెట్ నిర్ణయం మేరకు ఈ నియామకానికి ఆమోదం తెలిపారు. ఇకపై మణిపూర్‌లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకూడదని కేంద్రం తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ కూడా దీనిపైనే దృష్టిసారించారు. దాదాపు 5 రోజులుగా ఆ రాష్ట్రంలో అలజడి రేగుతూనే ఉంది. మైతేయి, కుకీల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా...30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సర్జికల్ స్ట్రైక్...?
మణిపూర్ సమస్యకి పరిష్కారం చూపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సమయంలో మణిపూర్‌లో బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) నేత ఎమ్ రామేశ్వర్ సింగ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులు,మిలిటెంట్స్‌పై సర్జికల్ స్ట్రైక్ చేయాలని అన్నారు. మూడు నెలులగా మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అల్లర్లలో 150 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పార్లమెంట్‌లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై చర్చించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రధాని మోదీ మణిపూర్‌పై మాట్లాడారు. త్వరలోనే శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే...అంత సుదీర్ఘ ప్రసంగంలో మణిపూర్ గురించి మాట్లాడింది కాసేపే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్య ఎలా పరిష్కరిస్తారో చెప్పకుండా విపక్షాలపై జోక్‌లు వేశారని రాహుల్ గాంధీ కూడా విమర్శించారు. ఈ క్రమంలోనే NPP నేత చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
"మణిపూర్ సరిహద్దు ప్రాంతంలో కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్‌లు అక్రమంగా చొచ్చుకుని వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యల్ని బట్టి ఇదే అర్థమవుతోంది. బయట నుంచి ఎవరో ఈ హింసకు ఆజ్యం పోస్తున్నారని నేను మొదటి నుంచి చెబుతున్నాను. జాతీయ భద్రత విషయంలో రాజీ పడొద్దు. కేవలం మణిపూర్‌నే కాదు. మొత్తం దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరముంది. సర్జికల్ స్ట్రైక్ లాంటి దాడులు చేసి మరీ హింసను అదుపులోకి తీసుకురావాలి"
- ఎమ్ రామేశ్వర్ సింగ్, NPP నేత
Also Read: హిందూ ధర్మాన్ని అవమానించడం వాళ్లకు కొత్తేం కాదు, ఉదయనిధి స్టాలిన్‌పై అమిత్ షా ఫైర్