News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Manipur Violence: మహిళలపై అమానుషానికి వ్యతిరేకంగా మణిపూర్‌లో భారీ ర్యాలీ

Manipur Violence: మణిపూర్ లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను నిరసిస్తూ స్థానికిలు భారీ ర్యాలీ నిర్వహించారు.

FOLLOW US: 
Share:

Manipur Violence: మణిపూర్‌లో ఇద్దరు గిరిజిన మహిళలను మరో వర్గం వారు నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ దారుణాన్ని నిరసిస్తూ గురువారం మణిపూర్ రాష్ట్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మణిపూర్ లోని చురచంద్‌పుర్‌ జిల్లాలో వేలాది మంది ప్రజలు నల్ల దుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. బాధిత గిరిజన మహిళలకు న్యాయం చేయాలని, దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. భారీ వర్షం కురుస్తున్నా నిరసనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు రావడం తీవ్రంగా కలచివేసిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలను అస్సలు అంగీకరించలేమని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము తీసుకుంటామని సీజేఐ అన్నారు.

దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. దీనిపై వచ్చే శుక్రవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. 'ఈ ఫొటోలు చూసి షాక్‌కి గురయ్యాం. హింసాత్మక ప్రాంతాల్లో మహిళలను వస్తువులుగా ఉపయోగించుకున్నారు. దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి" అని ఆదేశించారు.

మరోవైపు ప్రధాని మోదీ ఆగ్రహం

మణిపూర్‌లో అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన హింసాత్మక ఘటనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ మహిళను నగ్నంగా రోడ్లపై తిప్పిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో చాలా ఆవేశంగా మాట్లాడారు మోదీ. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. మణిపూర్‌లో జరిగిన దారుణం...మొత్తం దేశానికే కళంకం అని అన్నారు. మైతాయ్ కమ్యూనిటీ సభ్యులే మహిళలను నగ్నంగా తీసుకెళ్తూ వీడియోలు తీశారని కుకీ తెగకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీఎల్‌ఎఫ్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఐటీఎల్ఎఫ్ డిమాండ్ చేసింది.

మేలో గిరిజన తెగ మైతాయ్, పర్వతాలపై నివసిస్తున్న గిరిజన తెగ కుకి మధ్య ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. మెజారిటీగా ఉన్న మైతాయ్ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కోరుతూ లోయలో ఆందోళనలు ప్రారంభించారు. దీన్ని తిప్పికొట్టేందుకు కుకి గిరిజనుల సంఘాలు కూడా నిరసన తెలపడంతో హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ భయంకరమైన ఘర్షణలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ప్రజలు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలోని హింస చెలరేగింది. 

Published at : 20 Jul 2023 08:06 PM (IST) Tags: Manipur Manipur Violence Huge Protest Rally After Tribal Women Parade Video Incident

ఇవి కూడా చూడండి

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్నట్టుండి మంటలు, చూస్తుండగానే కాలి బూడిదైపోయింది - వైరల్ వీడియో

ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్నట్టుండి మంటలు, చూస్తుండగానే కాలి బూడిదైపోయింది - వైరల్ వీడియో

కార్‌పూలింగ్‌ని బ్యాన్ చేసిన బెంగళూరు, ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా - కారణమిదే

కార్‌పూలింగ్‌ని బ్యాన్ చేసిన బెంగళూరు, ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా - కారణమిదే

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'