(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra Train Fire: ఘోర రైలు ప్రమాదం - మంటల్లో దగ్ధమైన 5 బోగీలు
Fire brokes in train: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సబర్బన్ రైలులో మంటలు చెలరేగి 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
మహారాష్ట్రలో సోమవారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అహ్మద్ నగర్ నుంచి అష్టికి వెళ్లే సబర్బన్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు వ్యాపించగా 5 బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Fire in train, no injuries! Diesel Multiple Unit between New Ashti-Ahmednagar catches fire between Narayandoh to Ahmednagar section. Fire reported in the 5 coaches at 3pm, extinguished at 4:10 pm. No casualties or injuries. #Maharashtra @mid_day pic.twitter.com/ISDOpLTyxX
— Rajendra B. Aklekar (@rajtoday) October 16, 2023
ముందుగా గార్డ్ సైడ్ బ్రేక్ వ్యాన్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే పక్కన ఉన్న 4 కోచ్ లకు మంటలు వేగంగా వ్యాపించగా, అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను రక్షించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు ఇతర బోగీలకు అంటుకోకుండా చర్యలు చేపట్టారు. దౌండ్ నుంచి రైల్వే యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టాయి.