Maharashtra Political Crisis: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలు మిస్సింగ్- రంగంలోకి శరద్ పవార్
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో జరుగుతోన్న ప్రస్తుత పరిణామాలపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతోంది. శివసేనకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు గుజరాత్‌లో క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మరోవైపు వారితో సంప్రదింపులు జరిపేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రాజకీయ పరిణామాలపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.
Eknath Shinde has never conveyed to us that he wants to be CM...This is an internal issue of Shiv Sena, whatever they decide we're with them.We don't think there is any need for change in the govt: NCP's Sharad Pawar on some MLAs of Shiv Sena&Eknath Shinde currently not reachable pic.twitter.com/HVcAs56TaM
— ANI (@ANI) June 21, 2022
ఎవరి బలమెంత?
శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడం వల్ల ఉద్దవ్ ఠాక్రే సర్కార్ మైనార్టీలోకి వెళ్లేలా కనిపిస్తోంది. అసలు ఎవరి బలం ఎంతో ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. శివసేన ఎమ్మెల్యే ఒకరు మృతి చెందటంతో ఒక సీటు ఖాళీగా ఉంది.
శివసేనకు 55 సీట్లు, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44, భాజపాకు 106 సీట్లు ఉన్నాయి. బహుజన్ వికాస్ అగాధీకి మూడు, సమాజ్‌వాదీ, ఎంఐఎం, జనశక్తి పార్టీలకు చెరో రెండు సీట్లు ఉన్నాయి. ఇతర పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలకు 20 సీట్లు ఉన్నాయి.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 144 సీట్లు ఉంటే సరిపోతుంది. అయితే ఏక్‌నాథ్‌తో పాటు 10 మంది శివసేన ఎమ్మెల్యేలు సూరత్‌లో క్యాంప్ పెట్టడం వల్ల మహారాష్ట్ర అసెంబ్లీలో సంక్షోభం ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Also Read: Presidential Polls 2022: రాష్ట్రపతి రేసులో వెంకయ్య నాయుడు! నడ్డా, అమిత్ షా భేటీ అందుకేనా!
Also Read: France Elections 2022: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు షాక్- మెజార్టీ కోల్పోయిన అధికార కూటమి