అన్వేషించండి

Presidential Polls 2022: రాష్ట్రపతి రేసులో వెంకయ్య నాయుడు! నడ్డా, అమిత్ షా భేటీ అందుకేనా!

Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల వేళ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో జేపీ నడ్డా, అమిత్ షా సమావేశమయ్యారు.

Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇప్పటికీ అధికార ఎన్‌డీఏ కూటమి ఎవరిని బరిలోకి దింపుతుందనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు.

భేటీలో

మంగళవారం ఉదయం వెంకయ్య నాయుడుతో హోంమంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా సమావేశమయ్యారు. దీంతో రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడును నిలబెడతారా? అనే చర్చ మొదలైంది. గతంలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన వాళ్లు రాష్ట్రపతిగానూ పదోన్నతి పొందిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

ఉపరాష్ట్రపతులుగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి. గిరి, ఆర్‌. వెంకట్రామన్, డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ, కె.ఆర్‌ నారాయణన్‌, జాకీర్‌ హుస్సేన్‌లు రాష్ట్రపతులయ్యారు. దీంతో ఇప్పుడు వెంకయ్యనాయుడుకు ఆ అవకాశం దక్కవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

తేలనుందా?

మంగళవారం రాత్రి 7 గంటలకు భాజపా పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయొచ్చని అంతా భావిస్తున్నారు. 

ప్రతిపక్షాల అభ్యర్థి

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పేరు బలంగా వినిపిస్తోంది. టీఎంసీ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హా సడెన్‌గా ఆ పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.  

యశ్వంత్ సిన్హా ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో ఆయన రాష్ట్రపతి రేసులో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా నిలవడం దాదాపు ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఇక ఎన్‌డీఏ ఎవరిని బరిలోకి దింపుతుందో చూడాలి. 

రాష్ట్రపతి ఎన్నికలు

2017 జులై 25న రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది జులై 24తో రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తోంది. కొత్త రాష్ట్రపతి జులై 25న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

కీలక తేదీలు

  • ఎన్నికల నోటిఫికేషన్: జూన్ 15
  • నామినేషన్లకు చివరి రోజు: జూన్ 29
  • నామినేషన్ల పరిశీలన: జూన్ 30
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు: జులై 2
  • పోలింగ్: జులై 18
  • కౌంటింగ్, ఫలితాలు: జులై 21
  • ప్రమాణస్వీకారం: జులై 25

Also Read: France Elections 2022: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు షాక్- మెజార్టీ కోల్పోయిన అధికార కూటమి

Also Read: Govt Jobs For Retired Agniveers: అగ్నివీరులకు ఆ సీఎం బంపర్ ఆఫర్- రాష్ట్రంలో ఉద్యోగాలిస్తామని ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget