Govt Jobs For Retired Agniveers: అగ్నివీరులకు ఆ సీఎం బంపర్ ఆఫర్- రాష్ట్రంలో ఉద్యోగాలిస్తామని ప్రకటన
Govt Jobs For Retired Agniveers: అగ్నివీరులుగా పనిచేసి రిటైర్ అయిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హరియాణా సీఎం ప్రకటించారు.
Govt Jobs For Retired Agniveers: అగ్నిపథ్ పథకంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ భాజపా దాన్ని చల్లార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అగ్నిపథ్ పథకానికి రిజిస్టర్ అయ్యే వారి వయసు రెండేళ్లు పెంచింది కేంద్రం. తాజాగా హరియాణా సీఎం అగ్నివీరులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఉద్యోగాలిస్తాం
పదవీ విరమణ పొందిన అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. సాయుధ బలగాల్లో నాలుగేళ్లపాటు సేవలందించి రిలీవ్ అయిన తర్వాత అగ్నివీరులకు రాష్ట్ర ప్రభుత్వంలో గ్యారెంటీ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం హామి ఇచ్చారు.
నిరసన జ్వాలలు
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ, బంగాల్ సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. దీంతో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. 'అగ్నిపథ్' పథకంలో భాగంగా ఆర్మీలో చేరి సేవలు అందించనున్న అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇందులో చేరేందుకు గరిష్ట వయో పరిమితి 23కి చేరింది. పదిహేడున్నరేళ్ల నుంచి 23 సంవత్సరాల వయసుగల వారిని త్రివిధ దళాల్లో అగ్నివీరులుగా నియమిస్తారు. అగ్నిపథ్ పథకాన్ని గతంలో 'టూర్ ఆఫ్ డ్యూటీ'గా పిలిచేవారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
నాలుగేళ్ల సర్వీస్
ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళ సైనిక సేవలు రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో కేంద్ర రక్షణశాఖ విప్లవాత్మక మార్పులు తీసుకోస్తుంది. కొత్తగా ప్రతిపాదించిన మార్పుల ప్రకారం రిక్రూట్ చేసిన సైనికులందరూ 4 సంవత్సరాల తర్వాత సర్వీస్ నుండి విడుదల అవుతారు. అంతే కాదు సర్వీస్ నుంచి రిలీజ్ అయిన వారిలో కొంత మందిని పూర్తి సేవల కోసం తిరిగి చేర్చుకోవడం తప్పనిసరి. ఈ మార్పులను టూర్ ఆఫ్ డ్యూటీ/అగ్నీపథ్ పథకం (Agneepath Recruitment Scheme)లో భాగంగా చేపట్టబోతున్నారు.
Also Read: Presidential Polls 2022: రాష్ట్రపతి రేసులో భాజపా మాజీ నేత యశ్వంత్ సిన్హా- పక్కాగా దీదీ వ్యూహం!
Also Read: Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్- ఓ ఉగ్రవాది హతం