Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్- ఓ ఉగ్రవాది హతం
Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
ఇదీ జరిగింది
పుల్వామాలోని దుజన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేశాయి. బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారని దీంతో ఎదురుకాల్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.
#PulwamaEncounterUpdate: 01 #terrorist killed. Search going on. Further details shall follow.@JmuKmrPolice https://t.co/SSxiSewUEk
— Kashmir Zone Police (@KashmirPolice) June 19, 2022
ప్రస్తుతం మిగతా ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలోనే మరికొందరు ఉగ్రవాదులు దాక్కునట్లుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో జవాన్లు, జమ్ము కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఇటీవల
ఇటీవల జమ్ముకశ్మీర్‌లో జరిగిన 3 వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు కాగా మరో నలుగురు స్థానికులని పోలీసులు తెలిపారు.
కుప్వారాలో ఉగ్రవాదుల నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో బలగాలు, పోలీసులు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ చేశాయి. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆదివారం ఇద్దురు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఉదయం మరో పాకిస్థానీ ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. సోపియాన్ ప్రాంతంలోని ఓ స్థానిక ఉగ్రవా.ది కూడా ఇందులో ఉన్నారు. మృతి చెందిన వారిలో ఉగ్రవాది షోకత్ అహ్మద్ షేక్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాది షోకత్ అహ్మద్ షేక్ గురించి సమాచారం అందుకున్న ఆర్మీ 28ఆర్ఆర్‌తో పాటు కుప్వారా పోలీసులు గాలింపు ప్రారంభించారు. గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతా జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.
ఉక్కుపాదం
గత 20 రోజుల్లో సైన్యం జమ్ముకశ్మీర్‌లో 15 ఆపరేషన్లు నిర్వహించింది. ఆయా ఆపరేషన్లలో ఏడుగురు పాక్‌కు చెందిన ఉగ్రవాదులతో సహా మొత్తం 27 మంది హతమయ్యారు. లష్కరే తోబాయికు చెందిన 19 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సైనిక వర్గాలు తెలిపాయి. 2022లో ఇప్పటి వరకు 32 మంది పాకిస్థానీలతో సహా 110 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.