Russian Journalist Nobel Prize: ఉక్రెయిన్ పిల్లల కోసం నోబెల్ బహుమతి వేలం వేసిన రష్యన్ జర్నలిస్ట్- రికార్డ్ ధర!
Russian Journalist Nobel Prize: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల నిరాశ్రయులైన చిన్నారుల సహాయం కోసం జర్నలిస్ట్ దిమిత్రి మురాటోవ్ తన నోబెల్ బహుమతిని వేలం వేశారు.
Russian Journalist Nobel Prize: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికే 100 రోజులు దాటింది. అయితే ఇప్పటికీ యుద్ధం అవిశ్రాంతంగా కొనసాగుతోంది. ఎన్ని దేశాలు వారించినా, విజ్ఞప్తి చేసినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం యుద్ధం విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అయితే యుద్ధం వల్ల నిరాశ్రయులు, శరణార్ధులు అవుతోన్న వేలాది మంది ఉక్రెయిన్ వాసులకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. తాజాగా యుద్ధం కారణంగా నిరాశ్రయులైన చిన్నారుల సహాయార్థం రష్యాన్ జర్నలిస్ట్ దిమిత్రి మురాటోవ్ గొప్ప త్యాగం చేశారు.
ఏం చేశారంటే?
దిమిత్రి మురాటోవ్ తనకు లభించిన నోబెల్ బహుమతిని ఉక్రెయిన్‌లోని పిల్లల సాయం కోసం వేలం వేశారు. తనకు వచ్చిన నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ శరణార్థుల దినోత్సవం రోజునే వేలం నిర్వహించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో మురాటోవో నోబెల్ బహుమతికి వేలంలో రికార్డు స్థాయిలో 103.5 మిలియన్ డాలర్ల ధర పలికింది.
ఈ నోబెల్ ప్రైజ్ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన పిల్లల కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్ మానవతా సహాయానికి అందజేయనున్నారు.
The 2021 Nobel Peace Prize medal of Novaya Gazeta editor-in-chief Dmitry #Muratov was sold at an auction for $103.5 million.
— NEXTA (@nexta_tv) June 21, 2022
All proceeds will go to support the @UNICEF humanitarian mission to help #Ukrainian refugee children and their families. pic.twitter.com/HCzPwN7fh3
ఎవరు మురాటోవ్?
దిమిత్రి మురాటోవ్ 1999లో స్థాపించిన నోవాయా వార్తాపత్రిక సంపాదకుడు. మురాటోవ్ 2021లో ఫిలిప్పైన్స్‌కు చెందిన మరియా రెస్సాతో కలిసి నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన నాటి నుంచి మురాటోవ్ తన పత్రిక ద్వారా ఆయనను ఎండగడుతూ వార్తలు రాశారు. దీంతో రష్యా ప్రభత్వం వరుస హెచ్చరికలు చేసింది. తదనంతరం పూర్తిగా ఆ పత్రిక కార్యకలాపాలను నిలిపేసింది.
Also Read: International Yoga Day 2022: 17 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు- గడ్డ కట్టే చలిలో ఎలా చేశారు భయ్యా!