Presidential Polls 2022: రాష్ట్రపతి రేసులో యశ్వంత్ సిన్హా- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి
Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నిలబడుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను నిలబెడుతున్నట్లు కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.
టీఎంసీకి రాజీనామా
టీఎంసీ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హా సడెన్‌గా ఆ పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
I am grateful to Mamataji for the honour and prestige she bestowed on me in the TMC. Now a time has come when for a larger national cause I must step aside from the party to work for greater opposition unity. I am sure she approves of the step.
— Yashwant Sinha (@YashwantSinha) June 21, 2022
రేసులో
యశ్వంత్ సిన్హా రాజీనామా చేయడంతో ఆయన రాష్ట్రపతి రేసులో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా ఉన్నట్లు ఖరారైంది. అనంతరం విపక్ష నేతలు అధికారిక ప్రకటన చేశారు. ఇక ఎన్‌డీఏ ఎవరిని బరిలోకి దింపుతుందో చూడాలి.
ప్రొఫైల్
- బిహార్ పట్నాలో పుట్టిన యశ్వంత్ సిన్హా ఐఏఎస్ అధికారిగా, దౌత్య వేత్తగా పని చేశారు.
- సర్వీసులో ఉండగానే రాజీనామా చేసి 1984లో యశ్వంత్ జనతా పార్టీలో చేరారు.
- నాలుగేళ్లకు రాజ్యసభకు వెళ్లారు. జనతా దళ్ ప్రభుత్వంలో పార్టీ జనరల్ సెక్రటరీగా పని చేశారు.
- ఆ తర్వాత కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఏడాది పాటు పని చేశారు.
- 1996లో భాజపా అధికార ప్రతినిధిగా పని చేసిన యశ్వంత్ సిన్హా 22 ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నారు.
- 2018లో భాజపా పాలనను వ్యతిరేకించి 2021లో టీఎంసీలో చేరారు.
Also Read: Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్- ఓ ఉగ్రవాది హతం