By: Khagesh | Updated at : 10 Oct 2025 08:33 AM (IST)
బంగారంపై రుణాలు తీసుకునే వారికి బిగ్ షాక్- సిబిల్ స్కోర్ ప్రమాదంలో పడే అవకాశం ( Image Source : Other )
Gold Loan: బంగారంపై రుణాలు తీసుకోవడం సామాన్య ప్రజలకు అత్యంత సులభతరమైన ఆర్థిక సాధనంగా మారింది. గోల్డ్ రేటు పెరిగిన తర్వాత ఇలా రుణాలు తీసుకున్న వారి సంఖ్య పెరుగుతోంది. వ్యక్తిగత లేదా ఇతర తనఖా రుణాలకు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం ఇతర కారణాలతో గోల్డ్‌పై రుణాలు తీసుకునేందుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ వడ్డీ కూడ కేవలం 9 శాతంలోపే ఉండటం కూడా జనాలను టెంప్ట్ చేస్తోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనే దేశవ్యాప్తంగా బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య ఏకంగా 26 శాతానికి పెరిగింది. బంగారం ధరలు ఇంకా పెరుగుతున్న వేళ ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని అందుకే బ్యాంకులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
బంగారంపై బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం ఎంత సులభమో దీని వెనుక అంతకు మించిన సమస్యలు కూడ దాగి ఉన్నాయి. బంగారం ధర విలువ పెరగడంతో రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అదే టైంలో తిరిగి చెల్లించే వారి సంఖ్య తగ్గుతోంది. అంటే రుణాలు ఎగ్గొట్టే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టు బ్యాంకులు గుర్తించాయి. ఇది బ్యాంకింగ్ రంగానికి కొత్త సవాళ్లు విసురుతోంది.
బంగారం రుణాలు తీసుకున్నవారు నిర్దేశిత ఏడాది గడువులోగా చెల్లించలేకపోతున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించడంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. దాదాపు 30 శాతం మంది ఖాతాదారులు బంగారంపై రుణాలను ఎగ్గొడుతున్నారని బ్యాంకులు గుర్తించాయి. ఇలా ఎగ్గొట్టే రుణగ్రహీతల సంఖ్య ఎక్కువగా ఉంటే బ్యాంకుల ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారుతుంది. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బ్యాంకులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు బ్యాంకులు రూల్స్ మారుస్తున్నాయి.
కొన్ని బ్యాంకులు తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే.... బంగారంపై రుణం తీసుకున్న తేదీ నుంచి నెలనెలా వడ్డీని పూర్తిగా వసూలు చేయాలని నిర్ణయించాయి. దీని వల్ల బ్యాంకులకు మేలు జరుగుతుందని రుణాలు తీసుకునే వారికి కూడా ఇలా చెల్లించడం సౌకర్యవంతంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఈ రూల్ పాటించని ఖాతాదారులకు బ్యాంకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఒకవేళ ఖాతాదారు నెలనెలా వడ్డీని సరిగా చెల్లించకుంటే... అది నేరుగా వారి సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఆ వ్యక్తి క్రెడిట్ వాల్యూ పడిపోతుంది. దీని వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి వ్యక్తులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తాయి. వారిని రుణాలు ఎగ్గొట్టే జాబితాలో వేస్తాయి. బంగారంపై రుణాలు తీసుకోవడం సులభమైనా చెల్లించడంలో అజాగ్రత్త వహిస్తే మాత్రం ప్రమాదంలో పడతారు.
బంగారం విలువ ఆధారంగా ఎంత రుణం ఇవ్వాల్సి వస్తే దీనికి ఆర్బీఐ చాలా ఆంక్షలు పెట్టింది. వాటికి అనుగుణంగానే రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత రుణం తీసుకుంటున్నారు. ఎంత బంగారం పెడుతున్నారు. మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది. మీ గత ఆర్థిక చరిత్రను పరిశీలించి మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.
1. 2.50 లక్షల రూపాయల లోపు రుణం తీసుకుంటే బంగారం విలువపై 85 శాతం వరకు లోన్ మంజూరు చేస్తారు.
2. 2.50 నుంచి 5 లక్షలలోపు రుణం తీసుకుంటే బంగారం విలువలో 80 శాతం వరకు రుణం ఇస్తారు.
3. మీరు తీసుకునే రుణం రూ. 5 లక్షలకు మించితే బంగారం విలువలో 75 శాతం మాత్రమే లోన్ ఇస్తారు.
Children Day Special : మీ పిల్లలకు దేశ ప్రధాని సంరక్షణ - ఈ స్కీమ్ ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే అప్లై చేస్తారు
Children Day Special: పిల్లల బ్యాంక్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి ? ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
LIC Children Policy: మీ బిడ్డ భవిష్యత్‌కు భద్రత కల్పించే మంచి LIC పథకం ఇది
Emergency Fund : 2026కి ముందే ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండిలా.. చిన్న పొదుపులతో పెద్ద భద్రత!
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
Bigg Boss Telugu Day 70 Promo : భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?