Women's ODI World Cup 2025 | విమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పరమ చెత్త ప్రదర్శన
బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని ఓ కామెడీ సామెతుంది. కానీ పాకిస్తాన్ టీమ్‌ని చూస్తుంటే.. ఈ సామెత కరెక్ట్‌గా సరిపోతుంది అనిపిస్తోంది. మొన్న మెన్స్ టీమ్, ఇప్పుడు ఉమెన్స్ టీమ్.. రెండు టీమ్‌లూ గ్రౌండ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఓవర్ యాక్షన్‌లో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కానీ ఇంత ఎక్స్‌ట్రాలు చేసినా.. మ్యాచ్‌ల్లో గెలిచేది మాత్రం సున్నానే. మొన్న మెన్స్ ఆసియా కప్‌లో టోర్నీ మొత్తం బిల్డప్ కొట్టింది. ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్‌ల్లో హారిస్ రవూఫ్ లాంటి వాళ్లు మరీ ఓవర్ యాక్షన్ చేసి వార్తల్లోకెక్కారు. కానీ మొత్తం టోర్నీలో ఫైనల్‌తో కలిసి టీమిండియాతో 3 సార్లు తలపడిన పాక్ టీమ్.. మూడు సార్లూ ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. ఇక ఇప్పుడు పాక్ ఉమెన్స్ టీమ్ కూడా మెన్స్ టీమ్‌కి మేమేమైనా తక్కువా..? అన్నట్లు.. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఎంత చెత్తగా కుదిరితే అంత చెత్తగా ఆడి.. పరమ దారుణంగా ఓడిపోతోంది. వార్మప్ మ్యాచ్ నుంచి కౌంట్ చేస్తే.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కనీస రిటాలియేషన్ కూడా లేకుండా.. ఇంకా మాట్లాడితే రోజురోజుకూ ఇంకా ఇంకా దిగజారిపోతూ ఓడిపోతోంది. ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిన పాక్.. ఆ తర్వాత టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లో బంగ్లాపై 129 రన్స్‌కే ఆలౌటై 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక ఇండియాతో మ్యాచ్‌లో పాక్ ప్లేయర్ ఫాతిమా.. రఫేల్ కూల్చినట్లు సైగలు చేసి వైరల్ అయితే అయింది కానీ.. మ్యాచ్‌లో మాత్రం పాక్ జట్టు 88 పరుగుల తేడాతో ఓడి పరువు పోగొట్టుకుంది. ఇక రీసెంట్‌గా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అయితే 221 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో 114 రన్స్‌కే ఆలౌట్ అయి రికార్డ్ బ్రేక్ ఓటమిని మూటగట్టుకుంది. ఇక పాక్ టీమ్ ఓడిపోతున్న స్పీడ్ చూస్తుంటే.. కనీసం టోర్నీ గ్రూప్ స్టేజ్ కూడా దాటేలా కనిపించడం లేదు. అందుకే పెద్దోళ్లు ఓవర్ యాక్షన్ మానుకుని.. పనిమీద ఫోకస్ పెట్టాలి అని. కానీ అక్కడుంది ఎవరు? పాక్ టీమ్. వాళ్లకి ఇవన్నీ పట్టవు మరి..!





















