Chandrayaan Vs Luna 25: ఇండియాకు పోటీగా రష్యా! చంద్రయాన్ 3ని రష్యా కూల్చేస్తోందా? అసలు నిజం ఏంటి?
లూనా 25తో మన చంద్రయాన్ 3 ని పడగొట్టేస్తారా. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే డౌట్స్. అసలు నిజం ఏంటంటే..
ఇండియాకు రష్యాకు చెడిందా? ఇన్నాళ్లూ మంచి ఫ్రెండ్స్ లా ఉన్న ఈ దేశాలు ఇకపై శత్రువులుగా మారనున్నాయా. లేదంటే చంద్రుడి మీదకు మనం చంద్రయాన్ పంపిస్తే...రష్యా కూడా ఇదే టైమ్ లో లూన్ 25 స్పేస్ క్రాఫ్ట్ ను పంపించటం ఏంటీ. అంటే ఏంటీ లూనా 25తో మన చంద్రయాన్ 3 ని పడగొట్టేస్తారా. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే డౌట్స్. ఎవడికి కావాల్సినట్లు వాడు కథనాలు రాసుకుంటున్నాడు. కానీ అసలు నిజం ఏంటీ..ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఈ రోజు రష్యా చంద్రుడి మీదకు లూనా 25 రాకెట్ ను ప్రయోగించింది. మాస్కో కి 5500 కిలోమీటర్ల దూరంలో ఉన్న వోస్తోక్ కాస్తోడ్రోమ్ నుంచి సోయుజ్ 2.1 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేసింది రష్యా. ప్రయోగం జరిగిన 80 నిమిషాల తర్వాత చంద్రుడి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది లూనా 25 స్పేస్ క్రాఫ్ట్. ఆగస్టు 16కి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించే ఈ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండర్ ఈ నెల 21 లేదా 22నే చంద్రుడి సౌత్ పోల్ మీదకు దిగుతుంది. ఒక్కరోజు లేట్... మన చంద్రయాన్ 3 ల్యాండర్ 23న సౌత్ పోల్ మీదకు దిగుతుంది. గుర్తు పెట్టుకోండి రెండూ సాఫ్ట్ ల్యాండిగ్ అవ్వాలి లేదంటే ప్రయోగం ఫెయిల్ అయినట్లే. ఇదేంటీ మనం ల్యాండర్ దింపే ఒక్కరోజు ముందే రష్యా ఇలా చేయటం ఏంటి అనీ ఇండియా మీద ఏమన్నా కోపంతో చేస్తుందా ఎవరికి నచ్చిన రీజన్స్ ను వాళ్లు స్పెక్యులేట్ చేస్తున్నారు.
2022లోనే రష్యా ప్లాన్
వాస్తవానికి ఈ ప్రయోగం చేయాలని రష్యా 2022 ఫిబ్రవరి లో ప్లాన్ చేసింది. కానీ తెలుసుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలవటంతో ఇది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా డిఫెన్స్ సెక్టార్ మీద ఎక్కువ కాన్ స్ట్రేట్ చేస్తూ రావటంతో ఈ ప్రయోగం ఇన్నాళ్లూ ఆలస్యమైంది. మీకో డౌట్ రావచ్చు..మనం నెలరోజుల క్రితం చంద్రయాన్ 3 ప్రయోగం చేస్తే ఇంకా చంద్రుడి కక్ష్యలోనే తిరుగుతుంది. రష్యా ఎలా ఇలా ప్రయోగం చేసి మన కంటే ముందే ల్యాండర్ ను చంద్రుడి మీద దింపుతుంది అని. మన ఇస్రో సంగతి తెలిసిందే గా...వీలైనంత తక్కువ ఖర్చులో మనవాళ్లు స్పేస్ ప్రయోగాలు చేస్తారు. ఇప్పుడు కూడా చంద్రయాన్ 3 కోసం స్లింగ్ షాట్ పద్ధతిని ఫాలో అయ్యారు.
అంటే చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ భూమి కక్ష్యలో తిరిగి తిరిగి భూమి గురుత్వాక్షర్షణ శక్తి నుంచి ఒక్కసారిగా బయటపడి చంద్రుడి దిశగా ప్రయాణించింది. మళ్లీ చంద్రుడి చుట్టూ దాని కక్ష్యలో తిరుగుతూ చంద్రుడి మీద డే లైట్ వచ్చిన తర్వాత అంటే ఈనెల 23 న ల్యాండ్ అవుతుంది. చంద్రుడి మీద 14 రోజులు సూర్యకాంతి, 14 రోజులు చీకటి ఉంటాయి. సో మన కంటే ముందు సూర్యోదయం రష్యాలో అవుతుంది కాబట్టి మన కంటే ముందే చంద్రుడి మీద ల్యాండర్ రష్యా దింపుతుంది అన్నమాట. అంతే తేడా ఇదేం పోటీ కాదు. కానీ మనం భూమి మీద నుంచి చూస్తున్నాం కాబట్టి మన కంటే ముందే చంద్రుడి సౌత్ పోల్ మీద ల్యాండర్ దింపిన దేశంగా రష్యా చరిత్రలో నిలిచిపోతుంది. ఆ తర్వాత రెండో దేశంగా మనకు పేరు వస్తుంది.
సరే ఇప్పుడు రష్యా ఉన్నపళంగా ఎందుకు చేసింది అనేది ఇంకో డౌట్. మెయిన్ రీజన్ ఏంటంటే పాలసీ మేటర్స్. ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన స్పేస్ ప్రోగ్రామ్స్ పై మళ్లీ దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావించారు. దానికి మెయిన్ రీజన్ అమెరికా. ఓ వైపు ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్న అమెరికా మరోవైపు నాసా ద్వారా ఆర్టెమిస్ ప్రయోగాన్ని చేపట్టింది. భూమి కాకుండా మనిషికి వేరే ఆల్టర్నేటివ్ హ్యాబిటేషన్ క్రియేట్ చేయాలనేది ఆర్టెమిస్ ప్రయోగం లక్ష్యం. అందుకే అమెరికా నాసా ద్వారా ఓ మహిళ సహా ఓ టీమ్ ను చంద్రుడి మీద కాలు పెట్టించాలని చూస్తోంది. సో ఇప్పుడు అమెరికా చేస్తున్న ప్రయోగాలతో మళ్లీ అమెరికా-రష్యా కోల్డ్ వార్ మొదలైంది అన్నమాట.
ఇది ఇప్పుడు కాదు తెలిసిందేగా..అసలు స్పేస్ ప్రయోగాల కోసం తొలుత పోటీపడింది ఆ రెండు దేశాలే. రష్యా తొలిసారి మనిషిని అంతరిక్షంలోకి పంపిస్తే..అమెరికా తొలిసారి మనిషిని చంద్రుడి మీద దింపింది. నీల్ ఆర్మస్ట్రాంగ్ గుర్తున్నాడుగా అందరికీ. ఉరుము ఉరిమీ మంగళం మీద పడినట్లు అమెరికాతో పోటీపడకుండా మన మీద ఏంటీ అంటే...ఇండియా కూడా నాసా ఆర్టెమిస్ లో భాగం అయ్యింది. రీసెంట్ గా అమెరికాలో పర్యటించిన మోదీ నాసా-ఇస్రో డీల్ ను సెట్ చేశారు. కలిసి ప్రయోగాలు చేయంకానీ ప్రస్తుతానికి నాలెడ్జ్ ట్రాన్స్ ఫర్ వరకూ ఉంటుంది. ఫ్యూచర్ లో చెప్పలేం..కలిసి చంద్రుడి మీదకు మనుషులను కూడా పంపింపొచొచ్చు.
మరోవైపు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలైన స్పేస్ ఎక్స్ చంద్రుడి కాదు మార్స్ మీదకే వెళ్తాం అని పెద్ద ప్లాన్సే చేస్తోంది. ఎలన్ మస్క్ ను ఇప్పుడప్పుడే ఆపగలిగే సత్తా ఎవరికి లేదు కూడా. బ్లూ ఆరిజిన్ అని అమెజాన్ వాళ్లు, వర్జిన్ గెలాక్టిక్ వాళ్లు వీళ్లంతా స్పేస్ టూరిజం అని హడావిడి చేస్తున్నారు. సో ఈ టైమ్ లో రష్యా మాత్రమే వెనుకపడిపోతోదంని భావించారేమో పుతిన్ ఉన్నపళంగా ఎప్పటి నుంచో పెండింగ్ ఈ లూనా ప్రాజెక్ట్ ను మూవ్ చేయించారు. చరిత్రలో చంద్రుడి సౌత్ పోల్ మీద అడుగుపెడుతున్న ల్యాండర్ గా రష్యా ల్యాండర్ క్రెడిట్ సాధించనుంది.
ఈ పని చేసింది కదా అని ఇండియాకు రష్యా వ్యతిరేకం ఏం కాదు. మనది రష్యాది మైత్రీ బంధం ఎప్పటిదో. అసలు ఇస్రో ఈ స్థాయిలో ఇప్పుడు ప్రయోగాల్లో దుమ్మురేపుతుందంటే ఇనీషియల్ డేస్ లో రష్యా ఇచ్చిన సహకారం చాలా గొప్పది. అంతే కాదు రీసెంట్ రష్యా-ఉక్రెయిన్ యుద్దంలోనూ మనం తటస్ఠ వైఖరిని ప్రదర్శించామే కానీ ఎక్కడా రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. పైగా శాంతి కోరుకున్నాం యుద్ధం ఆపి చర్చలకు దిగండనే ప్రధాని మోదీ కోరారు కూడా. సో ఈ పోటీ రష్యా వర్సెస్ అమెరికాగానే చూడాలి. అంతే కానీ రాస్ కాస్మోస్ లేదా ఇస్రో గా కాదు.