ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో లాలూకి ఊరట, బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు
Land-For-Jobs Case: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది.
Land-For-Jobs Case:
లాలూకి ఊరట..
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఊరట లభించింది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్న రబ్రీదేవి, బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్‌జేడీ ఎంపీ మీసా భారతికి కూడా బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. వీళ్లందరూ రూ.50 వేల బెయిల్ బాండ్ కట్టాలని ఆదేశించింది. అక్టోబర్ 16న మరోసారి ఈ కేసుని విచారించనుంది కోర్టు. వీళ్లందరిపైనా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని CBIకి ఆదేశాలిచ్చింది.
#UPDATE | Delhi's Rouse Avenue Court grants bail to Former Bihar CM and RJD chief Lalu Yadav, former Bihar CM Rabri Devi, Bihar Deputy CM Tejashwi Yadav and RJD MP Misa Bharti, in connection with the alleged land-for-jobs scam case. https://t.co/LfiJYMY5wN
— ANI (@ANI) October 4, 2023
ఇప్పటికే జులై 3వ తేదీన సీబీఐ ఛార్జ్‌షీట్‌ని కోర్టుకి సమర్పించింది. దీని ఆధారంగానే అక్టోబర్ 4వ తేదీలోపు కోర్టులో విచారణకు హాజరు కావాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లందరికీ ఢిల్లీ కోర్టు నోటీసులు పంపింది. ఈ నోటీసుల మేరకు అంతా కోర్టుకి హాజరయ్యారు. కోర్టుకి వెళ్లే ముందు లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులో విచారణలు కొనసాగుతూనే ఉంటాయని, తాము ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు.
#WATCH | RJD chief Lalu Yadav on hearing on alleged land for jobs scam, "Hearings keep happening...Have to done anything that we need to be scared about?" pic.twitter.com/uz9aMekRON
— ANI (@ANI) October 3, 2023
ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవితో పాటు మొత్తం 14 మంది పేర్లు చేర్చింది. లాలూ హయాంలో ఈ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు చోట్ల స్థలాలను లంచంగా తీసుకున్నట్టు చెబుతోంది ఈడీ. 2004-09 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఈ స్కామ్ జరిగినట్టు ED అధికారులు ఆరోపిస్తున్నారు. ముంబయి, జబల్పూర్, కోల్కత్తా, జైపూర్, హాజిపూర్‌లలో పలువురికి గ్రూప్ D పోస్ట్‌లు ఇచ్చారని, అందుకు బదులుగా తమ పేరు మీద స్థలాలు రాయించుకున్నారని చెబుతున్నారు. AK Infosystems Private Limited పేరు మీద కూడా స్థలాలు రాయించారని ED వివరిస్తోంది. ఆ తరవాత ఈ కంపెనీ ఓనర్‌షిప్‌ను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల పేరుపై మార్చారన్న ఆరోపణలున్నాయి. లాలూని రెండు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో తీసింది ఈడీ. ఇప్పటికే సీబీఐ ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేసింది.
Also Read: ప్రైవేట్‌గా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం, భారత్‌కి కెనడా రిక్వెస్ట్