(Source: ECI/ABP News/ABP Majha)
ప్రైవేట్‌గా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం, భారత్‌కి కెనడా రిక్వెస్ట్
India Canada Tensions: భారత్‌తో ప్రైవేట్‌గా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తోంది కెనడా.
India Canada Tensions:
దౌత్యవేత్తల్ని తొలగించాలన్న భారత్..
భారత్ కెనడా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు రెండు వైపులా దౌత్యపరంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ ఓ డిమాండ్ చేసింది. భారత్‌లోని 41 మంది కెనడా దౌత్యవేత్తల్ని వెంటనే తొలగించాలని తేల్చి చెప్పింది. అక్టోబర్ 10వ తేదీలోగా వీళ్లందరినీ తొలగించాలని స్పష్టం చేసింది. దీనిపై ప్రధాని జస్టిన్ ట్రూడో మాత్రం స్పందించలేదు. కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జాలీ (Melanie Joly) మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోడానికి కెనడా భారత్‌తో అంతర్గత చర్చలు (Private Talks) జరపాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. భారత ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.
"భారత ప్రభుత్వంతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తల భద్రతపై దృష్టి సారించాం. ఇప్పటి నుంచి భారత్‌తో అంతర్గతంగా చర్చించాలని చూస్తున్నాం. ప్రైవేట్‌గా మాట్లాడుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం"
- మెలనీ జాలీ, కెనడా విదేశాంగ మంత్రి
ట్రూడో ఏమన్నారంటే..
అక్టోబర్ 10వ తేదీ తరవాత కెనడాకి చెందిన దౌత్యవేత్తలు భారత్‌లోనే ఉంటే రెండు దేశాల మధ్య దౌత్యమూ దెబ్బ తింటుందని, అందుకైనా వెనకాడమని భారత్ స్పష్టం చేసింది. Financial Times రిపోర్ట్ ప్రకారం...కెనడా ఈ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దౌత్యవేత్తల్ని తొలగిస్తామని చెప్పలేదు. అంతకు ముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Justin Trudeau) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతల్ని మరింత పెంచాలని అనుకోవడం లేదని వెల్లడించారు. ఈ విషయంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారత్‌లోని కెనడా పౌరులకు రక్షణ కల్పించేందుకు భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కానీ...భారత్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో రెండు దేశాల మధ్య నిప్పు రాజుకుంది. భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది కెనడా. నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని మండి పడింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది.
భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు కెనడా ఇప్పటికీ సిద్ధంగానే ఉందని వెల్లడించారు ట్రూడో. నిజ్జర్ హత్య విషయంలో తాము భారత్‌పై చేసిన ఆరోపణలు చేసినప్పటికీ ద్వైపాక్షిక బంధం విషయానికొచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎలాంటి ప్రభావం చూపిస్తోందో గమనిస్తున్నామన్న ట్రూడో...భారత్‌తో మైత్రి కొనసాగించడం తమకు ఎంతో ముఖ్యమని తేల్చి చెప్పారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన...ఈ వ్యాఖ్యలు చేశారు.
"భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించడం మాకెంతో అవసరం. అంతర్జాతీయంగా భారత్ ఎలాంటి ప్రభావం చూపిస్తోందో గమనిస్తున్నాం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. జియోపొలిటికల్ పరంగా చూసినా ఆ దేశానిది కీలక పాత్ర. ఇండో పసిఫిక్ స్ట్రాటెజీలోనూ ఆ దేశం ముఖ్య పాత్ర పోషిస్తోంది. అందుకే భారత్‌తో బంధాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నాం. కానీ ఇదే సమయంలో కొన్ని విషయాల్లో భారత్ మాకు సహకరించాలి. మా న్యాయ వ్యవస్థను గౌరవించాలి. నిజ్జర్ హత్య విషయంలో ఏం జరిగిందో తేలాలంటే భారత్ సహకారం అవసరం"
- జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాన మంత్రి
Also Read: సిక్కింలో ఆకస్మిక వరదలు-23 మంది సైనికులు మిస్సింగ్