Krishna Janmabhoomi Row: శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపుపై పిటిషన్- విచారణకు కోర్టు ఓకే
Krishna Janmabhoomi Row: మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన ప్రాంగణంలో ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది కోర్టు.
Krishna Janmabhoomi Row: ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు మథుర కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసు సీనియర్ డివిజన్ కోర్టులో నడుస్తుంది. కృష్ణుడి భక్తురాలు రంజనా అగ్నిహోత్రి రెండేళ్ల క్రితం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత దీనిపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
Shri Krishna Janmabhoomi-Shahi Idgah Masjid dispute | Plaintiffs had filed suit in lower court & observed that plaintiffs don't have right to sue. A revision was filed before Mathura dist court. Court now said that lower court's order is wrong & stayed it: Adv Mukesh Khandelwal pic.twitter.com/FcGydV1NkV
— ANI (@ANI) May 19, 2022
శ్రీకృష్ణ జన్మభూమి మొత్తం 13.37 ఎకరాల భూమిలో ఉంది. మసీదు నుంచి ఆలయాన్ని వేరు చేసేందుకు ఉద్యమం చేపడతామని హిందూ ఆర్మీ చీఫ్ సంగథన్ అప్పట్లో హెచ్చరించింది. అనంతరం సంగథన్ అధ్యక్షుడు మనీశ్ యాదవ్‌తో పాటు మరో 21మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
1967లో కోర్టు ఆమోదంతో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థ, షాహి ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి.13.37 ఎకరాల విస్తీర్ణంలోని శ్రీ కృష్ణ జన్మభూమిలోని కత్రా కేశవ్ దేవ్ ఆలయంపై 1669-70లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దాడి చేసి మసీదు నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై సివిల్ కోర్టుల్లో పలు దరఖాస్తులు, పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
దేశంలో ఉన్న పలు మసీదులపై ఇప్పుడు వరుస పిటిషన్లు నమోదవుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదుపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించేలా కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే సివిల్ కోర్టు విచారణను మే 20 వరకు ఆపివేయాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశాలిచ్చింది.
Also Read: Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
Also Read: Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు