Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు
Gyanvapi Mosque Case: శివలింగం బయటపడిందని చెబుతోన్న జ్ఞానవాపి మసీదులో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Gyanvapi Mosque Case:
ఉత్తర్‌ప్రదేశ్ జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
నమాజ్‌కు ఓకే
ముస్లింలను జ్ఞానవాపి మసీదులో నమాజ్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. శివలింగం బయటపడిన జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ ప్రాంతాన్ని సీజ్ చేసి ఉంచాలని ఆదేశించింది. శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించే బాధ్యత కలెక్టర్‌కు అప్పగించింది.
కమిషనర్ తొలగింపు
మరోవైపు జ్ఞానవాపి మసీదులో చేసిన వీడియోగ్రఫీ సర్వే నివేదికను ఈ నెల 19లోగా సమర్పించాలని వారణాసి సివిల్ కోర్టు ఆదేశించింది. అదే సమయంలో కోర్టు కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను తొలగించింది. అజయ్ కుమార్ మిశ్రా పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు రావడంతో ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Uttar Pradesh | Court has granted two days time to submit the report. He (Advocate-Commissioner Ajay Kumar Mishra) was not cooperating: Assistant Court Commissioner Ajay Pratap Singh on Gyanvapi mosque report survey pic.twitter.com/u9WXJpAG4j
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 17, 2022
Gyanvapi mosque survey | We had sought two days' time from the court. The Court has granted us two days' time for submission of the report: Advocate Vishal Singh, the Court-appointed special assistant commissioner, in Varanasi pic.twitter.com/Lw7DfAn0ch
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 17, 2022
ఈ నివేదికను సమర్పించేందుకు రెండు రోజుల సమయం కావాలని అసిస్టెంట్ కోర్టు కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కోర్టు 2 రోజుల గడువిచ్చింది.
ఇదీ కేసు
జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు.
Also Read: PM Boris Johnson: ఆహా, అట్నా- 'వర్క్ ఫ్రమ్ హోం' గురించి ఏం చెప్పారు పీఎం సారూ!
Also Read: Green Card: భారతీయులకు శుభవార్త- ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!