'ఐ లవ్ పాకిస్థాన్' అనే పేరుతో కథువా సరిహద్దు వద్ద బెలూన్ లభ్యం
Jammu Kashmir News: విమానం ఆకారంలో ఉన్న ఈ బెలూన్‌పై 'ఐ లవ్ పాకిస్థాన్' అని ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రాశారు. బెలూన్ దొరికిన తర్వాత జమ్ముకశ్మీర్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
Jammu Kashmir News: జమ్ముకశ్మీర్‌లోని కథువా సరిహద్దు సమీపంలో శనివారం (అక్టోబర్ 8) ఉదయం అనుమానాస్పద బెలూన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విమానం ఆకారంలో ఉన్న బెలూన్ పై 'ఐ లవ్ పాకిస్థాన్' అనే కామెంట్ రాసి ఉంది. జమ్మకశ్మీర్ పోలీసులకు ఈ బెలూన్ దొరికింది. పసుపు బెలూన్‌పై ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఐలవ్ పాకిస్థాన్ అని రాశారు.
One suspicious balloon has been recovered by police near International Border in Kathua: Jammu and Kashmir Police pic.twitter.com/mUbYFhGx71
— ANI (@ANI) October 8, 2022
తదుపరి దర్యాప్తు కోసం బెలూన్‌ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని కథువా జిల్లాలోని చామ్ బాగ్ ప్రాంతంలో ఈ బెలూన్ దొరికింది. బెలూన్ దొరికిన తరువాత, జమ్మ,కాశ్మీర్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో వెతికారు, కాని అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు
పోలీసుల దర్యాప్తు
ఈ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న స్థానికులే ఇలాంటి పనులు చేశారా లేదా ఇది వేరే సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలలా జరిగాయి.
సరిహద్దు వెంబడి డ్రోన్లు
ఇది కాకుండా గతంలో సరిహద్దు వెంబడి డ్రోన్లు వచ్చిన సంఘటనలు అనేకం చూశాం. పంజాబ్‌లోని గురుదాస్పూర్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ నుంచి డ్రోన్ వచ్చింది. మంగళవారం (అక్టోబర్ 4) ఈ సంఘటన జరిగింది. దీనిపై బీఎస్ఎఫ్ సిబ్బంది కూడా కాల్పులు జరిపారు.