అన్వేషించండి

Chandrayan-3: నాలుగోసారి చంద్రయాన్ 3 కక్ష్య పొడిగింపు, విన్యాసం విజయవంతం అని ప్రకటించిన ఇస్రో

చంద్రయాన్ ప్రయోగంలో మరో అడుగు పడింది. గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్యను ఇస్రో పెంచింది. ప్రస్తుతం చంద్రయాన్‌-3 ఉపగ్రహం 51400 కిమీ x 228 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలో తిరుగుతోంది.

చంద్రయాన్ ప్రయోగంలో మరో అడుగు పడింది. గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్య (ఎర్త్‌ బౌండ్‌ ఆర్బిట్‌ మాన్యువర్‌)ను ఇస్రో పెంచింది. ప్రస్తుతం చంద్రయాన్‌-3 ఉపగ్రహం 51400 కిమీ x 228 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలో తిరుగుతోంది. వచ్చే నెల 5న చంద్రుడి కక్షలోకి చేరుకుంటుందని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 14న శ్రీహరికోట నుంచి చంద్రయాన్ నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇస్రో చంద్రయాన్ ప్రయాణాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తోంది. దశలవారిగా క్రమక్రమంగా ఇంజిన్‌ను మండించి కక్ష్యను పెంచుకుంటూ వెళ్తోంది.

చంద్రయాన్ భూకక్షలో ప్రవేశించిన తరువాత ఇస్రో మూడుసార్లు కక్ష్యను పెంచింది. తాజాగా గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్యను పెంచింది. ఈ నెల 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య మరోసారి ఇంజిన్‌ను మండించి కక్ష్యను పెంచనుంది. వచ్చే నెల 5 నాటికి చంద్రుడి కక్షలోకి చేరుకోనుంది. ఆగస్టు 23, 24 వరకు చంద్రుడిపై ల్యాండ్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

నాలుగు  లక్షల కిలోమీటర్ల ప్రయాణం
చంద్రయాన్ 3ని బాహుబలి రాకెట్‌గా చెప్పిన ఇస్రో ఆ తరవాత దానికి  Launch Vehicle Mark 3 గా పేరు పెట్టింది. దీని బరువు 642 టన్నులు. బరువు 3,921కిలోలు. భూమి నుంచి చంద్రుడి వరకూ దాదాపు 4 లక్షల కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. ల్యాండర్, రోవర్ మాడ్యూల్‌ వేరువేరుగా ఉన్న ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ చంద్రుడి సౌత్ పోల్‌కి సమీపంలో ల్యాండ్ అవ్వనుంది. ప్రపల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ పలుసార్లు తిరిగి చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడిపై గ్రావిటీకి తగ్గట్టుగా మాడ్యూల్‌ మెల్లగా కిందకు దిగుతుంది. ల్యాండర్‌ విడిపోతుంది. లాంఛ్‌ అయినప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల తరవాత చంద్రుడిపై మాడ్యూల్ దిగుతుంది.

తక్కువ ఖర్చుతో ప్రయోగం

చైనా, రష్యాలు జంబో రాకెట్లను ఉపయోగించి చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపించాయి. చైనా, అమెరికా దాదాపు రూ.1000కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా.. అయితే ఇస్రో రూ.500కోట్ల నుంచి రూ.600 కోట్లతోనే ప్రయోగం చేపడుతోంది. చంద్రుడి కక్ష్య వరకు వెళ్లే శక్తివంతమైన రాకెట్ సైతం ఇస్రో వద్ద లేకపోయినా క్లిష్టమైన ప్రక్రియలో ప్రయోగం చేపట్టింది. భారత్ సత్తా ప్రపంచమంతా చాటేలా ప్రయోగం చేసింది.

వర్చువల్ టెలిస్కోప్‌కు చిక్కిన చంద్రయాన్

ఇటలీలోని మన్సియానోకు చెందిన వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ అంతరిక్షంలో తిరుగుతూ చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న చంద్రయాన్-3ను చిత్రీకరించింది. అందులో చంద్రయాన్-3 ఓ చుక్కలా వేగంగా ప్రయాణిస్తోంది. భూమికి 341 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-3 కదలికలను వర్చువల్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఇటలీకి చెందిన ఈ వర్చువల్ టెలిస్కోప్ ఖగోళానికి చెందిన పలు విషయాలను ఎప్పటికప్పుడు గుర్తించి సమాచారం ఇస్తూ ఉంటుంది. చంద్రయాన్-3 విషయంలోను ఈ టెలిస్కోప్ తన పనితనం, నైపుణ్యం ప్రదర్శించింది. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

టాప్ హెడ్ లైన్స్

India Hockey Jersey: హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget