అన్వేషించండి

How to Prove Indian Citizenship: ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?

Indian Citizenship Act: నువ్వు భారత పౌరుడివేనా అని నిరూపించుకోవడానికి నీ వద్ద ఏ పత్రం సరిపోదు. మరి ఎలా నిరూపించుకోవాలి?

Citizenship Legal Analysis:  భారతదేశంలో నివసిస్తున్న ప్రతి సామాన్య పౌరుడి వద్ద ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి అనేక ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఉంటాయి. అయితే, ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు తీర్పులు, వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల వివరణల ప్రకారం.. ఇవేవీ కూడా ఒక వ్యక్తి  భారత పౌరుడు అనడానికి సంపూర్ణమైన లేదా తిరుగులేని చట్టపరమైన సాక్ష్యాలు కావనే నిశ్శబ్ద సత్యం సామాన్యుడిని తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం  మాత్రమేనని స్పష్టం చేయడం ఈ చర్చను మరింత తీవ్రతరం చేసింది. మరి ఇన్ని పత్రాలు ఉన్న సామాన్యుడు తాను భారతీయుడిని అని నిరూపించుకోవడానికి ఎక్కడికి వెళ్లాలి? అసలు పౌరసత్వ నిరూపణకు ప్రత్యేకంగా ఒక పత్రం ఉండాలా?  
 
 ఏ కార్డ్ పరిధి ఎంతవరకు? 

మనం నిత్యం ఉపయోగించే ప్రతి ప్రభుత్వ పత్రానికి రాజ్యాంగం, చట్టాల పరిధిలో నిర్దేశిత పరిమితులు ఉన్నాయి 

 ఓటర్ ఐడీ  : ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కేవలం ఓటు వేసే హక్కును, నివాసాన్ని మాత్రమే ధృవీకరిస్తుంది.
 ఆధార్ కార్డ్: ఇది కేవలం ఒక వ్యక్తి గుర్తింపు , నివాస చిరునామా మాత్రమే. ఇది పౌరసత్వానికి నిరూపణ కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) చట్టంలోనే స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టు సైతం తన పలు తీర్పుల్లో దీనిని పౌరసత్వ పత్రంగా అంగీకరించబోమని తేల్చిచెప్పింది.
 పాన్ కార్డ్  : ఇది కేవలం ఆదాయపు పన్ను శాఖ పన్నుల వసూళ్లు, ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్ కోసం ఇచ్చే పది అంకెల గుర్తింపు సంఖ్య మాత్రమే.
 పాస్‌పోర్ట్   :  విదేశాలకు వెళ్లేందుకు కేంద్రం జారీ చేసే ఈ పత్రం పౌరసత్వానికి బలమైన ఆధారంగా భావించినప్పటికీ, సాంకేతికంగా ఇది ఒక ప్రయాణ పత్రమేనని, పౌరసత్వ వివాదాలు వచ్చినప్పుడు దీనిని మాత్రమే తుది సాక్ష్యంగా తీసుకోలేమని చట్టాలు చెబుతున్నాయి.
 

 భారత పౌరసత్వ చట్టం 1955 ఏం చెబుతోంది? 

సాంకేతికంగా ఒక వ్యక్తి భారత పౌరుడా కాదా అనేది తేల్చడానికి భారత పౌరసత్వ చట్టం 1955  అత్యంత కీలకం. ఈ చట్టం ప్రకారం పౌరసత్వాన్ని ప్రధానంగా మూడు రకాలుగా గుర్తిస్తారు: జనవరి 26, 1950 నుంచి జూలై 1, 1987 మధ్య భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సహజంగానే భారత పౌరులు. జూలై 1, 1987 తర్వాత పుట్టిన వారైతే, వారు పుట్టిన సమయానికి తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. డిసెంబర్ 3, 2004 తర్వాత పుట్టిన వారైతే తల్లిదండ్రులు ఇద్దరూ భారత పౌరులై ఉండాలి లేదా ఒకరు పౌరుడై ఉండి, మరొకరు అక్రమ వలసదారు కాకూడదు. అంటే, ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిరూపించాల్సింది కేవలం ప్రస్తుత గుర్తింపు కార్డులు కావు, వారి పుట్టుక ,  వారి తల్లిదండ్రుల పుట్టుకకు సంబంధించిన చట్టపరమైన ఆధారాలు  మాత్రమే పౌరసత్వాన్ని నిర్ణయిస్తాయి.  

 అస్సాం ఎన్ఆర్‌సీ  అనుభవాలు.. సామాన్యుడి ఆందోళన 

పౌరసత్వ నిరూపణ పత్రాల వివాదం కేవలం సిద్ధాంత పరమైనది కాదు, అది ప్రాక్టికల్ సమస్య. అస్సాంలో చేపట్టిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్  ప్రక్రియే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ లక్షలాది మంది సామాన్యుల వద్ద ఓటర్ కార్డులు, ఆధార్ వంటి పత్రాలు ఉన్నప్పటికీ.. వారు 1971 మార్చి 24 కంటే ముందు నుంచే తాము లేదా తమ పూర్వీకులు భారతదేశంలో నివసిస్తున్నట్లు  లెగసీ డేటా  లేదా బర్త్ సర్టిఫికెట్లు చూపించలేక కాలానుగుణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ చారిత్రాత్మక పరిణామాలే.. రేపు దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ వస్తే సామాన్య పౌరుడు తన పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఎలాంటి పత్రాలు చూపించాలనే ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
 
 ప్రత్యేక పౌరసత్వ ధృవీకరణ పత్రం ఉండాలా? 

ప్రస్తుత గందరగోళానికి తెరపడాలంటే దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ఒక పౌరసత్వ గుర్తింపు పత్రం  ఉండాలా అనే ప్రశ్న ఇప్పుడు న్యాయ , సామాజిక వర్గాల్లో తలెత్తుతోంది. అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో సిటిజన్‌షిప్ సర్టిఫికెట్ లేదా స్పష్టమైన పౌరసత్వ చట్టబద్ధత కలిగిన పత్రాలు ఉంటాయి. భారతదేశంలో కూడా ఆధార్ లేదా ఓటర్ ఐడీలను కేవలం ఒక విభాగంగా కాకుండా, వాటిలో పౌరసత్వ హోదాను చట్టబద్ధంగా ధృవీకరించేలా మార్పులు చేయాలి. లేదా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ద్వారా దేశంలోని చట్టబద్ధమైన పౌరులందరికీ ఒకే ఒక తిరుగులేని పౌరసత్వ కార్డును జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.   ఒకవేళ భవిష్యత్తులో ఎవరికైనా పౌరసత్వానికి సంబంధించిన చట్టపరమైన సవాల్ లేదా నోటీసు ఎదురైతే, వారు ప్రస్తుత డిజిటల్ కార్డుల కంటే కూడా తమ పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం , తమ తల్లిదండ్రుల పుట్టుక లేదా విద్యా అర్హతల పత్రాలు, పాత రెవెన్యూ రికార్డులను  భద్రపరుచుకోవడమే ఏకైక మార్గం.  
 
చట్టాల సరళీకరణ ప్రభుత్వ బాధ్యత 

ఓటు వేయడానికి, పన్నులు కట్టడానికి, దేశ సరిహద్దులు దాటడానికి ప్రభుత్వమే అధికారికంగా పత్రాలను జారీ చేసి.. తీరా పౌరసత్వం విషయానికి వచ్చేసరికి ఇవేవీ సరిపోవు.. మీ పూర్వీకుల పత్రాలు చూపించండి  అనడం సామాన్య నిరక్షరాస్యులకు, గిరిజనులకు, వలస కూలీలకు పెద్ద శాపంగా మారుతుంది. అందువల్ల, భవిష్యత్తులో డిజిటల్ ఇండియా వేదికగా ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడీలనే పౌరసత్వానికి కూడా ప్రాథమిక సాక్ష్యాలుగా గుర్తించేలా చట్టాల్లో తగిన సవరణలు తీసుకురావడమే ఈ దేశవ్యాప్త గందరగోళానికి శాశ్వత పరిష్కారమన్నది ఎక్కువ మంది భావన
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget