ATM Facility On Moving Train: కదిలే రైళ్లలో ఏటీఎం సేవలు, ప్రయోగాత్మకంగా ఆ ట్రైన్‌లో సర్వీస్ ప్రారంభించిన రైల్వేశాఖ
ATM Facility On Moving Train: కదిలే ట్రైన్‌లో ఏటీఎం సౌకర్యాన్ని తీసుకొచ్చింది ఇండియన్ రైల్వేశాఖ. ప్రజల సౌకర్యార్థం ప్రయోగాత్మకంగా 'పంచవటి 'ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది.

ATM Facility On Moving Train: ప్రయాణికు సౌకర్యాలు మెరుగుపరుస్తున్న రైల్వే శాఖ స్టేషన్ మాత్రమే కాకుండా బోగీలను కూడా ఆధునీకరిస్తోంది. ఇప్పుడు కొత్తగా భారతీయ రైల్వేల్లో ఐటీఎం సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూనే ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
రైల్వే ప్రయాణ సమయాల్లో చాలా మంది క్యాష్‌ను క్యారీ చేయరు. భద్రత విషయంతోపాటు పెరిగిపోతున్న డిజిటల్ టాన్షాక్షన్‌తో చాలా మంది జేబుల్లో క్యాష్ కంటే కార్డులే ఉంటున్నాయి. అయితే అత్యవసరంలో డబ్బులు అవసరమైతే వాళ్లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర రైల్వేశాఖ ఈ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
రైల్వేల ఆధునీకరణలో భాగంగా ప్రయాణికులకు కొత్త కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది ఇండియన్ రైల్వే శాఖ. ఆలా తీసుకొచ్చిన లేటెస్ట్ ఫెసిలిటీ ట్రైన్‌లోనే ATM సేవలు. డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ కావడంతో క్యాష్‌ను ప్రయాణంలో క్యారీ చేయడం తగ్గిపోయింది. అయితే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రయాణ మధ్యలో క్యాష్ లభించడం కష్టం అవుతుంది. కాబట్టి రైల్వేస్ కొన్ని ట్రైన్లలో ప్రయోగాత్మకంగా ATMలను ఏర్పాటు చేస్తోంది.
ముందుగా ఈ ట్రైన్ నుంచే ప్రారంభం
ఈ ప్రయోగాన్ని ముందుగా ముంబై నుంచి మన్మాడ్ వరకూ ప్రయాణించే 'పంచవటి ' ఎక్స్‌ప్రెస్‌లో ఏటీఎం ఏర్పాటు చేశారు. సెంట్రల్ రైల్వే (CR) నిర్వహించే 12110 నెంబర్ గల పంచవటి ఎక్స్ ప్రెస్ ప్రతీ రోజు ఉదయం 6:02కి మన్మాడ్‌లో బయలుదేరి అదే రోజు ఉదయం 10:45కి CSMT ముంబై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6:15కి ముంబైలో బయల్దేరి రాత్రి 10:50కి మన్మాడ్ చేరుకుంటుంది. ముంబై నుంచి షిరిడి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ ట్రైన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ ట్రైన్ లోనే ఏటీఎం ఏర్పాటు చేశారు.
A/C చైర్‌కార్‌లో ATM
'పంచవటి' ఎక్స్‌ప్రెస్‌లోని A/C చైర్‌కార్‌లో ATM ఏర్పాటు చేయాలనే రైల్వేస్ ఆలోచనకు మద్దతు ఇస్తూ బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర ఈ ATM ఏర్పాటు చేసినట్టు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా తెలిపారు. A/C చైర్‌కార్‌లో ఏర్పాటు చేసిన ATM రక్షణ కోసం ఒక షట్టర్ డోర్ ఏర్పాటు చేసినట్టు రైల్వే తెలిపింది. దీనికి లభించే ప్రజాదరణను బట్టి రానున్న రోజుల్లో మరికొన్ని ట్రైన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే రెడీగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ట్రైన్లు అనుకూలం
మన తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట తిరిగే డైలీ ట్రైన్లకి కూడా ఇలాంటి సౌకర్యం అవసరం ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. శాతవాహన ఎక్స్ప్రెస్, పినాకిని, రత్నాచల్, సింహాద్రి, జన్మభూమి, జన శతాబ్ది లాంటి ట్రైన్లు కూడా ఇలాంటి ప్రయోగానికి అనుకూలంగా ఉంటాయి. ఈ ట్రైన్లలో తరిగే వాళ్లు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా ట్రైన్లలో ఏటీఎం సేవలు అందుబాటులో తీసుకొస్తారేమో చూడాలి.





















