అన్వేషించండి

AI Anchors: మీడియాలో AI యాంకర్‌ల ట్రెండ్, జీతాలు ఇవ్వకుండానే 24 గంటలు పని చేస్తాయ్

AI Anchors: ఇండియాలో AI యాంకర్‌ల ట్రెండ్ మొదలైంది.

AI Anchors: 

ట్రెండింగ్‌లో ఏఐ యాంకర్‌లు

"వార్తలు చదువుతున్నది" అని చెబుతుంటే మన ముందు తరం వాళ్లు చెవులు రిక్కించి మరీ రేడియో ఆన్ చేసుకుని న్యూస్ వినే వాళ్లు. టీవీ వచ్చాక అందరూ వార్తలు చూడడం మొదలు పెట్టారు. ఆ తరవాత టెక్నాలజీ మారుతూ వచ్చింది. న్యూస్ ఛానల్స్ పెరిగాయి. జర్నలిజం అప్‌డేట్ అయింది. న్యూస్ ప్రజంటేషన్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. వార్తలకు అదనపు హంగులు జోడించడం ట్రెండ్ అయింది. మరి ట్రెండ్‌ ఎప్పుడూ ఒక్కటే ఉండదుగా. అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే అందరినీ ఆశ్చర్యపరిచే ట్రెండ్ ఇప్పుడు మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీతో తయారు చేసిన యాంకర్‌లతో (AI Anchors) వార్తలు చదివిస్తున్నాయి న్యూస్ ఛానల్స్. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో 2018 ఫిబ్రవరిలో Xinhua అనే న్యూస్ ఏజెన్సీ తొలి AI యాంకర్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. అందరూ ఇది చూసి నివ్వెరపోయారు. ఇప్పుడిదే టెక్నాలజీతో ఇండియాలోని న్యూస్ ఛానల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యాంకర్‌లను తెరపైకి తీసుకొస్తున్నాయి. వాటితో వార్తలు చదివిస్తున్నాయి. భారత్‌లో Odisha TV ఇటీవలే Lisa పేరిట AI Anchorని ప్రవేశపెట్టింది. ఒరియాతో పాటు ఇంగ్లీష్‌లోనూ ఈ యాంకర్ వార్తల్ని గడగడా చదివేస్తోంది. ఆమె AI తయారు చేసిన యాంకర్ అంటే ఎవరూ నమ్మలేరు. అంత మాయ చేసేసింది టెక్నాలజీ. చాలా సహజంగా వార్తల్ని చదివేసింది. చీరకట్టు, బొట్టుతో కట్టి పడేసింది. ఒరియా, ఇంగ్లీష్ మాత్రమే కాదు. అతి త్వరలోనే మరి కొన్ని భాషల్లోనూ ఈ AI యాంకర్ వార్తలు చదివేస్తుందని ఒడిశా టీవీ వెల్లడించింది. అంతకు ముందు ఓ హిందీ న్యూస్ ఛానల్ కూడా AI యాంకర్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. కన్నడలోనూ ఓ న్యూస్ ఛానల్ సౌందర్య పేరిట AI యాంకర్‌తో వార్తలు చదివిస్తోంది. 

విదేశాల్లోనూ..

ఈ ఏడాది ఏప్రిల్‌లో కువైట్ న్యూస్ (Kuwait News) Fedha పేరుతో ఓ AI యాంకర్‌ని పరిచయం చేసింది. అంతకు ముందు మార్చి నెలలో చైనాకు చెందిన  People's Daily ఛానల్  Ren Xiaorong పేరుతో ఓ యాంకర్‌ని తెరపైకి తీసుకొచ్చింది. ఆడియెన్స్‌తో ఇంటరాక్ట్ అవడం ఈ యాంకర్‌ స్పెషాల్టీ. నిజానికి...AI Developersకి ఇలా యాంకర్‌లని క్రియేట్ చేయడం చాలా సులువైన పనే అంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు. వీటితో లాభమేంటంటే...24 గంటల పాటు రెస్ట్ లేకుండా వీటితో వార్తలు చదివించొచ్చు. పైగా మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో. మరో హైలైట్ ఏంటంటే..ఓ సారి తప్పు చదివితే దాన్ని కరెక్ట్ చేసుకుని ఇంకెప్పుడూ అలా చదవకుండా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. అయితే...ఈ AI యాంకర్‌ల వల్ల అసలు యాంకర్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదేమో అన్న ఆందోళన మొదలైంది. ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీల్లో మనుషులకు బదులుగా టెక్నాలజీయే అన్ని పనులు చక్కబెడుతోంది. మైక్రోసాఫ్ట్, IBM, గూగుల్‌ లాంటి బడా కంపెనీలు AI వచ్చాక కొంత మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది అమెరికాలో జరిగిన లేఆఫ్‌లకు 5% వరకూ AI కారణంగా ఉంది. అలా అని అప్‌డేటెడ్‌గా లేకుంటే మార్కెట్‌లో అవుట్‌డేట్ అవుతాం కదా అని బదులిస్తున్నాయి ఆయా సంస్థలు. మొత్తానికి ప్రస్తుతానికి AI యాంకర్ల ట్రెండ్‌ మాత్రం గట్టిగానే నడుస్తోంది. 

Also Read: Chandrayaan-3 Mission: చంద్రయాన్ 3 లాంఛ్‌ని క్లియర్‌గా చూడాలా? అయితే ఈ వ్యూ పాయింట్స్‌కి వెళ్లండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Google Chrome AI Mode: గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Embed widget