Quad Summit 2022: అన్ని దేశాలకు అనుకూలమైన ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ కోసం భారతదేశం పని చేస్తుంది: ప్రధాని మోదీ
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా కాస్త గతి తప్పిన సంబంధాలను గాడి పెట్టాలని ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆర్థిక ఒప్పందంలో కీలక పాత్ర పోషిస్తున్న నమ్మకం, పారదర్శకత, సమయపాలనతో అందరికీ అనుకూలమైన ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ కోసం భారతదేశం కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఈవెంట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో కలిసి ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.
"భారతదేశం మీ అందరితో కలుపుకొని అనువైన ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ కోసం పని చేస్తుంది. దీని కోసం మన మధ్య మూడు అంశాలపై గట్టి నమ్మకం ఉండాలని నేను నమ్ముతున్నాను. అవి నమ్మకం, పారదర్శకత, సమయపాలన. ఈ ఫ్రేమ్‌వర్క్‌పై నాకు నమ్మకం ఉంది. వీటిని బలోపేతం చేస్తుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి, శ్రేయస్సుకు మార్గాన్ని చూపుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచ జనాభాలో సగం మందిని ఇండో-పసిఫిక్ కవర్ చేస్తుంది... గ్లోబల్ జీడీపీలో 60 శాతానికిపైగా దేశాల అధినేతలు ఇక్కడ ఉన్నారు. భవిష్యత్తులో ఈ ఫ్రేమ్‌వర్క్‌లో చేరిన వారు ఆర్థిక బలోపేతానికి పని చేయడానికి అంగీకరిస్తున్నారు. ఆ ఫలాలు మన ప్రజలందరికీ అందిద్దాం."
"మనం 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థ కోసం కొత్త నియమాలను రాస్తున్నాం. మన దేశ అన్ని ఆర్థిక వ్యవస్థలు వేగంగా, న్యాయంగా వృద్ధి చెందుతాయని" అని బైడెన్ పేర్కొన్నారు. "కొన్ని తీవ్రమైన సవాళ్లను స్వీకరంచడం ద్వారా వృద్ధిని పెంచడంతోపాటు బలమైన వృద్ధి రంగాల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. " అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా మాట్లాడుతూ అమెరికా, ప్రాంతీయ భాగస్వాముల సహకారంతో ఇండో-పసిఫిక్ ప్రాంత స్థిరమైన శ్రేయస్సుకు జపాన్ దోహదం చేస్తోందన్నారు. .
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ప్రకటన
ఆసియన్ ఆర్థిక వ్యవస్థలతో వాణిజ్యాన్ని పెంపొందించేందుకు రూపొందించిన ఒప్పందం ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్‌లో 12 దేశాలు చేరనున్నాయని అమెరికా ప్రకటించింది.ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రెసిడెంట్ జో బైడెన్ సోమవారం 12 ఇండో-పసిఫిక్ దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని ప్రారంభించారు.
జపాన్ ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిడాతో చర్చలు జరిపిన తర్వాత మీడియాతో మాట్లాడిన బైడెన్ యుఎస్ ఆర్థిక వ్యవస్థకు సమస్యలు ఉన్నాయని అంగీకరించారు. అయితే అవి "ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ సమస్యలని అన్నారు.
యుఎస్‌లో మాంద్యం అనివార్యమవుతుందా అన్న ప్రశ్నకు స్పందించిన బైడెన్.. "ఇది చాలా తొందరపాటు అవుతుంది. దీనికి కొంత సమయం పడుతుంది" అని చెప్పారు.
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఏర్పడిన అంతరాల తర్వాత వాణిజ్యంలో స్థిరత్వ అవసరాన్ని పరిష్కరించడం లక్ష్యంగా ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ పెట్టుకుంది.
ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్‌లో యూఎస్‌తో చేరిన దేశాలు ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండియా, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ వియత్నాం. యునైటెడ్ స్టేట్స్‌తోపాటు వీళ్లంతా ప్రపంచ జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కరోనావైరస్, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఏర్పడిన అంతరాయాలను అనుసరించి భవిష్యత్తు కోసం తమ ఆర్థిక వ్యవస్థలను సమిష్టిగా సిద్ధం చేసుకోవడానికి ఈ ఒప్పందం సహాయపడుతుందని దేశాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
సప్లై చెయిన్, డిజిటల్ వాణిజ్యం, క్లీన్ ఎనర్జీ, కార్మికుల రక్షణ, అవినీతి నిరోధక ప్రయత్నాల వంటి అంశాలపై సన్నిహితంగా పని చేయడానికి యునైటెడ్ స్టేట్స్, ఆసియా ఆర్థిక వ్యవస్థలకు ఫ్రేమ్‌వర్క్ సహాయపడుతుందని వైట్ హౌస్ పేర్కొంది.