అన్వేషించండి

Nuclear Weapons: పాక్ కంటే భారత్‌లో అణ్వాయుధాలు ఎక్కువ, అందనంత ఎత్తులో చైనా- సంచలన నివేదిక

SIPRI Report : అణ్వాయుధాల్లో పాకిస్తాన్, చైనాతో భారత్ పోటీ పడి మరీ సమకూర్చుకుంటోందని సిప్రీ నివేదిక తెలియజేసింది. 9 దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది.

Stockholm International Peace Research Institute: ప్రపంచంలోని 9 అణ్వాయుధ దేశాలు తమ ఆయుధాలను అప్‌డేటే చేసుకున్నట్టు స్వీడన్‌కు చెందిన సంస్థ ఓ నివేదికని బహిర్గతం చేసింది. ఈ విషయంలో ఆయా దేశాలు పోటాపోటీగా ముందుకెళ్తున్నట్టు తెలిపింది. స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సోమవారం ఓ సంచలన రిపోర్టు బహిర్గతం చేసింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్థాన్‌ తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను 2023లో అప్‌డేట్ చేసుకున్నాయని సిప్రీ పేర్కొంది. ఇందులో చాలా కొత్త ఆయుధాలు ఉన్నట్టు తెలిపింది. 

చైనా వద్ద 500 యుద్ధ ట్యాంకులు 

జనవరి 2023లో చైనా వద్ద 410 అణ్వాయుధాలు ఉంటే ఏడాదిలోపు వాటిని 500కు పెంచుకున్నట్టు సిప్రీ వెల్లడించింది. వీటి సంఖ్యను మరింత పెంచుకునే దిశగా ఆ దేశం చర్యలు తీసుకుంటుందని కూడా వివరించింది. చైనా వద్ద ఉన్న వార్‌హెడ్‌లలో 2100 బాలిస్టిక్ క్షిపణుల రూపంలో హై ఆపరేషన్‌ అలర్ట్‌ మోడ్‌లో ఉంచారని సిప్రి రిపోర్టు తేల్చింది. ఇవన్నీ కూడా రష్యా, అమెరికాకు చెందినవే. తొలిసారిగా చైనా కొన్ని వార్‌హెడ్‌లను హై ఆపరేషనల్ అలర్ట్‌లో ఉంచినట్టు బాహ్య ప్రపంచానికి తెలిసింది. 

కొత్త అణ్వాయుధాలు తయారీ 
చైనాతోపాటు అణ్వాయుధ దేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ తమ అణ్వాయుధాలను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. అదే టైంలో కొత్త అణ్వాయుధాలు సిద్ధం చేసుకుంటున్నట్టు SIPRI తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 2024 జనవరి నాటికి 12,121 వార్‌హెడ్‌లు ఉంటే... వాటిలో దాదాపు 9,585 సైనిక స్థావరాల్లో ఉంచారు. అవసరమైనప్పుడు వాడుకునేందుకు వీలుగా వీటిని రెడీ చేశారు. 3,904 వార్‌హెడ్‌లను క్షిపణుల, ఎయిర్‌క్రాఫ్ట్‌లతో అనుసంధానించారు. వీటి సంఖ్య జనవరి 2023తో పోల్చుకుంటే ఎక్కువ రూపొందించారు. మిగిలిన వాటిని సెంట్రల్ స్టోరేజీలో ఉంచారు. 

ఈ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులపై మల్టిపుల్‌ వార్‌హెడ్‌లను మోహరించే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. రష్యా, ఫ్రాన్స్, యుకె, యుఎస్, చైనా ఇప్పటికే ఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.  .మల్టిపుల్‌ వార్‌హెడ్‌లలో లక్ష్యం దిశగా స్పీడ్‌గా దూసుకెళ్లే స్వభాన్ని కలిగి ఉంటాయి. గణనీయంగా ఎక్కువ లక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉంది. రష్యా, అమెరికా దాదాపు 90 శాతం అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని SIPRI తెలిపింది.

2023తో పోల్చుకుంటే స్థానిక స్థావరాల్లో ఉండే యుద్ధ ట్యాంకుల సంఖ్య స్థిరంగా ఉందని నివేదిక తెలిపింది. జనవరి 2023 కంటే దాదాపు 36 వార్‌హెడ్‌లను రష్యా ఎక్కువ సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేసిన వేళ రెండు దేశాల్లోనూ అణు బలగాలకు సంబంధించి పారదర్శకత పూర్తిగా క్షీణించింది. దీంతో అణు భాగస్వామ్య చర్చలు జరగాల్సిన స్థితి మరింతగా పెరిగింది. 

ఆయుధాలలో పోటీ పడుతున్న భారత్, పాకిస్తాన్ 

ఈ ఏడాది జనవరిలో భారత్‌ వద్ద అన్వాయుధాలు 172 ఉండగా, పాకిస్థాన్‌లో 170 ఉన్నాయి. భారత్‌ తన వద్ద ఉన్న అణ్వాయుధాలను 2023లో విస్తరించింది. ఈ రెండు దేశాలు 2023లో కొత్త రకాల న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్‌లను అభివృద్ధి చేసుకున్నాయి. 

"భారత అణ్వాయుధ నిరోధక టీంలో ఉన్నప్పటికీ పాకిస్థాన్, చైనా స్థాయి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యతను చూపుతున్నట్లు కనిపిస్తోంది. సుదీర్ఘ లక్ష్యాలను చేరుకునే ఛేదించే అణ్వాయుధాల సమకూర్చునే పనిలో ఉన్నట్టు" అని నివేదిక పేర్కొంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: విజయవాడలోని మధురానగర్‌లో బిర్యాని షాపు దగ్ధం! 
విజయవాడలోని మధురానగర్‌లో బిర్యాని షాపు దగ్ధం! 
Rahul Gandhi Student Paper Leak Protest: విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
Bihar News In Telugu: అంత్యక్రియలకు డబ్బుల్లేక మూడు రోజులు భర్త మృతదేహం పక్కనే కూర్చున్న భార్య!
అంత్యక్రియలకు డబ్బుల్లేక మూడు రోజులు భర్త మృతదేహం పక్కనే కూర్చున్న భార్య!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
Embed widget