(Source: ECI/ABP News/ABP Majha)
అదానీ గ్రూప్ తప్పు చేసిందనడానికి ఆధారాలేవి - హిండెన్‌బర్గ్ కేసు విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్న
Hindenburg Case: హిండెన్ బర్గ్ కేసు విచారణలో భాగంగా ఆధారాలు కావాలంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Hindenburg Case Hearing:
సుప్రీంకోర్టులో విచారణ..
హిండెన్‌బర్గ్ కేసు (Hindenburg Report) విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్‌ని టార్గెట్ చేసిన ఈ రిపోర్ట్‌పై పలు ప్రశ్నలు వేసింది. విదేశీ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌లను నమ్మడమెలా అని ప్రశ్నించింది. తాము ఈ రిపోర్ట్‌ని కొట్టిపారేయడం లేదని, ఆధారాలుంటే కోర్టుకి సమర్పించాలని స్పష్టం చేసింది. George Soros ఇచ్చిన ఈ రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అదానీ గ్రూప్‌లో అక్రమమార్గంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని ఈ రిపోర్ట్ ఆరోపించింది. జార్జ్ సోరోస్ స్థాపించిన Organised Crime and Corruption Reporting Project (OCCRP) ఈ ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఇద్దరు ఫారిన్ ఇన్వెస్టర్‌ల చేతుల్లోనే ఇదంతా జరిగిందని చెప్పింది. ఈ ఆరోపణల్ని Adani Group కొట్టిపారేసింది. హిండన్‌బర్గ్ రిపోర్ట్‌ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పింది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఈ అంశంపై తమ వాదన వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తోంది. రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించారు. సెబీ కూడా ఈ రిపోర్ట్‌ని ఖండించింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని మండి పడింది. మొత్తానికి ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.
"విదేశీ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌లో ఉన్నదంతా నిజమే అని ఎలా నమ్మగలం. అయినా మేం ఆ రిపోర్ట్‌ని కొట్టిపారేయడం లేదు. మాకు ఆధారాలు కావాలి. అదానీ గ్రూప్ తప్పు చేసిందనడానికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో చూపించండి"
- సుప్రీంకోర్టు
Supreme Court seeks to know what will SEBI do to ensure that the volatility in the stock market is prevented in the future.
— ANI (@ANI) November 24, 2023
SG Mehta takes the court through the expert committee's recommendations.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అసహనం వ్యక్తం చేశారు. విదేశీ సంస్థలు ఇచ్చిన ఇలాంటి రిపోర్ట్‌లపైన విచారణ చేపట్టాలని చెప్పడం సరికాదని అన్నారు. భారత్ విధానాలపై విదేశీ సంస్థలు ఇలా విమర్శలు చేయడం ఓ ట్రెండ్ అయిపోయిందని మండి పడ్డారు. సెబీ తరపున వాదించిన తుషార్ మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు.
On the hearing on the matter regarding Hindenburg report, SG Tushar Mehta tells the Supreme Court that SEBI is not seeking an extension on further investigation relating to the Hindenburg report. There are 24 cases. Out of 24 cases, the investigation in 22 cases is over
— ANI (@ANI) November 24, 2023
Also Read: Tesla in India: భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు టెస్లా ఓకే, కానీ ఆ ఒక్క కండీషన్ వల్లే ఆలస్యం!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply