Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి- నలుగురు గల్లంతు, సిమ్లాలో ఒకరు మృతి
Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు నలుగురు గల్లంతయ్యారు. సిమ్లాలో ఒకరు మృతి చెందారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుల్లు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద క్లౌడ్ బస్ట్ (కుంభవృష్టి) అయింది. దీంతో ఆ గ్రామంలో నలుగురు గల్లంతయ్యారు.
Himachal Pradesh | In a could burst that happened around 4 am, 2 places including Malana nullah & Choj, Parvati valley were affected. 2 houses were destroyed at a camping site in Choj. We suspect 4 have drowned & 2 are trapped: Vikash Shukla, SDM Kullu (1/3) pic.twitter.com/8ZDZYPsnap
— ANI (@ANI) July 6, 2022
పార్వతి నదిలో అకస్మాత్తుగా వరద పెరగడంతో సమీపంలో ఉన్న క్యాంపు సైట్లన్నీ కొట్టుకుపోయాయి. దీంతో కొందరు టూరిస్లు కొట్టుకుపోయి ఉంటారని స్థానికులు అంటున్నారు.
#WATCH | Himachal Pradesh: Flash flood hits Manikaran valley of Kullu district due to heavy rainfall, dozens of houses and camping sites damaged in Choj village: SP Kullu Gurdev Sharma pic.twitter.com/NQhq8o8JXC
— ANI (@ANI) July 6, 2022
సిమ్లాలో
మరోవైపు భారీ వర్షాల కారణంగా సిమ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ రాయి కారు మీద పడడంతో ఓ మహిళ మృతి చెందింది. ఇద్దరు గాయపడ్డారు. దిల్లీ టన్నెల్ వద్ద ఈ ఘటన జరిగింది.
మంగళవారం రాత్రి నుంచి సిమ్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఫిరోజ్‌పుర్-షిప్కీ జాతీయ రహదారిని మూసివేశారు. బ్రోనీ నుల్లాలో నీటి ప్రవాహం పెరగడంతో హైవేను బ్లాక్ చేశారు.
Also Read: Spicejet Airlines: 17 రోజుల్లో 7 ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు- స్పైస్‌జెట్‌కు అసలు ఏమైంది?
Also Read: UK Ministers Resign: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌కు షాక్- ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా!