Karnataka Hijab Row Verdict: హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు - కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
Karnataka High Court Verdict On Hijab Row: విద్యా సంస్థల్లో హిజాబ్ లాంటివి మత పరమైన ఆచారాలు పాటించడం తప్పనిసరి కాదని, హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
Hijab Row Verdict: విద్యా సంస్థల్లో హిజాబ్ (బురఖా) ధరించకూడదనే వివాదంపై దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ లాంటి మత పరమైన ఆచారాలు పాటించడం తప్పనిసరి కాదని పేర్కొంది. విద్యా సంస్థలో హిజాబ్ తప్పనిసరి కాదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి నేతృత్వంలో జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎస్ ఖాజీలతో కూడిన ధర్మాసనం తీర్పు (Karnataka High Court Verdict On Hijab Row:) వెలువరించింది. ఫిబ్రవరి 5 నాటి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వును చెల్లుబాటయ్యేలా కేసు నమోదు చేయలేదని కర్ణాటక హైకోర్టు తెలిపింది.
వివాదాలక్ చెక్ పెట్టేలా ధర్మాసనం వ్యాఖ్యలు..
కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించిన కారణంగా ముస్లిం విద్యార్థులకు ప్రవేశం నిరాకరించారు. అదే సమయంలో హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు రావడంతో ఇరు మతాల విద్యార్థుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మరోవైపు వివాదాలకు చెక్ పెట్టేందుకు విద్యా సంస్థలకు విద్యార్థులు హిజాబ్ ధరించి రాకూడదని కొన్ని ఆంక్షలు విధించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తీర్పును నేడు కర్ణాటక హైకోర్టు వెలువరించింది. విద్యా సంస్థల్లో కచ్చితంగా హిజాబ్ ధరించాలి అనేది ఇస్లాం సాంప్రదాయంలో తప్పనిసరి కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
వారి ఇళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం..
రాష్ట్రంతో పాటు దేశంలోనూ సంచలనంగా మారిన హిజాబ్ వివాదంపై సంచలన తీర్పు నేపథ్యంలో చీఫ్ జస్టిస్ అవస్థితో పాటు తీర్పు ఇచ్చిన ధర్మాసనం జడ్జిలందరి ఇళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేసింది కర్ణాటక ప్రభుత్వం. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం వాటిల్లకుండా చూసేందుకు నేటి నుంచి 7 రోజులపాటు బెంగళూరులో సెక్షన్ 144ని విధించారు. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించకూడదనే దాఖలైన పిటిషన్లపై నేడు తీర్పు వెలువడనుండగా, కర్ణాటక ప్రభుత్వం సున్నితమైన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసింది.
విద్యా సంస్థలు బంద్..
కర్ణాటక హైకోర్టు తీర్పు నేపథ్యంలో నేడు బెంగళూరు, మంగళూరు, శివమొగ్గలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాలైన రాష్ట్రంలోని కలబురగి, దావణగెరె, బెల్గాం, కొప్పల్, గడగ్, హాసన్ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించించింది. ఉన్నాయి. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, హోంశాఖ మంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో ఇదివరకే సమావేశమై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని హోం శాఖ మంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
Also Read: Sandeep Nangal: పంజాబ్‌లో దారుణం - అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడిని కాల్చి చంపిన దుండగులు!
Also Read: SC on Hijab Row: 'హిజాబ్'పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్- విచారణకు సుప్రీం నో