Operation Sindoor: LOC వద్ద ఆగని పాక్ దుశ్చర్యలు, తాజా పరిస్థితిపై ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్
Operation Sindoor: పూంచ్‌లోని LOC వద్ద రాత్రిపూట భీకర కాల్పులు జరిగాయి. భారత సేన పాకిస్తాన్ డ్రోన్ దాడులను విఫలం చేసి ప్రతీకారం తీర్చుకుంది. అయినా పాకిస్థాన్‌కు బుద్ది రావడం లేదు.

Operation Sindoor: భారతదేశంలోని 15 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్తాన్ విఫలయత్నం చేసింది, ఇందులో జమ్మూ, పంజాబ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే పాక్ దుష్ట ప్రయత్నాన్ని భారతదేశం విఫలం చేసింది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని పుంచ్‌లో పాకిస్తాన్ సైన్యం నిరంతరం భీకరమైన కాల్పులు జరుపుతోంది. అవి మోర్టార్, షెల్లింగ్ ద్వారా దాడి చేస్తోంది. దీనికి సైన్యం అంతే స్థాయిలో తిప్పికొడుతోంది. అలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ జీరోలో పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం.
ఏబీపీ న్యూస్‌కు చెందిన రిపోర్టర్ జగ్విందర్ పటాయల్ పుంచ్‌కు చేరుకుని పరిస్థితి గురించి అక్కడి నుంచి వివరించారు. పుంచ్‌లో రాత్రి బ్లాక్ అవుట్ ప్రకటించడంతో పరిస్థితి అంధకారంలోకి వెళ్లింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా జగ్విందర్ మొబైల్ లైట్ ద్వారా అక్కడి పరిస్థితి వివరించారు. ఈ క్రమంలో ఆయన ఆ ప్రాంతాన్ని ఇప్పటికే ఖాళీ చేయించారని తెలిపారు. పాకిస్తాన్ దాడిలో ఎవరి ప్రాణనష్టం లేదు, కానీ ఆ ప్రాంతంలోని ఆస్తులకు నష్టం జరిగింది.
పటాయల్ మాట్లాడుతూ, పుంచ్‌లో రాత్రి నుంచి పాకిస్తాన్ నిరంతరం భారీగా కాల్పులు జరుపుతోంది. దానికి భారత సైన్యం ప్రతిస్పందిస్తోంది. ఇది సాధారణ కాల్పులు కాదు, కానీ వేగవంతమైన ఆర్టిలరీ షెల్లింగ్, మోర్టార్ ఫైర్, రాకెట్ లాంచర్లు. పేలుళ్ల శబ్దం చాలా బలంగా, కంటిన్యూగా ఉంటున్నాయి. క్షణం కూడా కళ్ళు మూసుకోవడం కష్టం. ప్రతి మూల, ప్రతి వీధి, మొత్తం లోయ పేలుళ్లతో మారుమోగిపోతోంది. దీని ప్రభావం స్థానిక జీవితంపై చాలా తీవ్రంగా ఉంది.
భారతదేశం కచ్చితమైన ప్రతిస్పందన
భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్, పీవోకేలో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది, దీని తరువాత పాకిస్తాన్ ఆగ్రహంతో ఉంద. డ్రోన్లు, క్షిపణి దాడుల ద్వారా భారతదేశంపై దాడి చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తోంది. మే 8 రాత్రి సుమారు 8 గంటలకు, పాకిస్తాన్ మళ్ళీ దాడి చేసింది, ఇందులో జమ్మూ, రాజస్థాన్, పంజాబ్‌లను లక్ష్యంగా చేసుకుంది, కానీ భారతదేశం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్‌తో ఈ దాడులను విజయవంతంగా తప్పికొట్టింది. పుంచ్ పైన కూడా నిరంతరం ఆకాశంలో ఎరుపు రంగు వృత్తాలు, రాకెట్ లాంటి కాంతి కనిపిస్తోంది, ఇది పాకిస్తాన్ దాడులకు భారతదేశం నుంచి వస్తున్న తీవ్రమైన ప్రతిస్పందనగా తెలుస్తోంది. .
అంధకారంలో చాలా ప్రాంతాలు
పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, పుంచ్ మరియు చుట్టుపక్కల గ్రామాలను ఖాళీ చేయించారు. ఇళ్లలో లైట్లు ఆపేశారు, రోడ్లపై చీకటి, ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఏబీపీ రిపోర్టర్లు ప్రతి సెకను మోర్టార్, ఆర్టిలరీ పేలుళ్లు ఎలా జరుగుతున్నాయో వివరిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చే మోర్టార్ షెల్స్ సీటీలాంటి శబ్దం, భారతదేశం నుంచి వెళ్లే భారీ రాకెట్ ఫైర్ శబ్దం మొత్తం ప్రాంతాన్ని యుద్ధభూమిగా మార్చింది.
S-400, భారతీయ ఆర్టిలరీ ఫోర్స్ శక్తి ప్రదర్శన
భారత సైన్యం S-400 క్షిపణి వ్యవస్థ, బోఫోర్స్ తుపాకులు , బహుళ బారెల్ రాకెట్ లాంచర్లను ఉపయోగిస్తోంది. నివేదికల ప్రకారం, భారతదేశం పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు , మోర్టార్లను ఆకాశంలోనే అడ్డుకుని డీయాక్టివేట్ చేసింది.





















