Viral Video: విద్యార్థుల ముందే జుట్లు పట్టుకున్న టీచర్లు- ఈ ఫైటింగ్ వేరే లెవల్
పాట్నాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఫైట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాఠశాలలో కిటికీ మూసివేయడంపై టీచర్స్ మధ్య గొడవ మొదలైంది. అదే తర్వాత కొట్టుకునేంత వరకు వెళ్లింది.

పిల్లలు కొట్టుకుంటే సర్ధి చెప్పాల్సిన టీచర్సే వీర లెవల్లో కుమ్మేసుకున్నారు. ఒకప్పుడు నీటి కుళాయిల వద్ద జరిగే పానీపట్టు యుద్ధాలను తలపించిందీ ఫైటింగ్.
పాట్నాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఫైట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాఠశాలలో కిటికీ మూసివేయడంపై టీచర్స్ మధ్య గొడవ మొదలైంది. అదే తర్వాత కొట్టుకునేంత వరకు వెళ్లింది.
పట్నాకు సమీపంలోని కొరియా పంచాయితీలో ఈ ఫైటింగ్ సీన్ కనిపించింది. ముందు బడిలోని క్లాస్ రూమ్‌లో కొట్టుకున్న టీచర్స్... తర్వాత పాఠశాల గ్రౌండ్‌లో పిచ్చ పిచ్చగా కొట్టుకున్నారు. అక్కడకు వచ్చిన వారంతా ఆ ఫైటింగ్ సీన్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ఎప్పుడూ సైలెన్స్, కొట్టుకోవద్దు, మంచిగా ఉండండీ అని చెప్పే టీచర్స్ అలా బజారున పడి కొట్టుకుంటుంటే చూస్తూ ఉండిపోయారు.
అక్కడ ఏదో ట్రైనింగ్ క్లాస్‌లు జరుగుతున్నట్టు ఉంది. అందులో అక్కడకు చాలా మంది తల్లిదండ్రులు, చిన్న పిల్లలు వచ్చినట్టు ఉన్నారు. ఈ క్లాస్‌లు జరుగుతున్న టైంలోనే క్లాస్ రూం కిటికీ వేయాలని ప్రధానోపాధ్యాయురాలు చెబితే అందుకు క్లాస్ టీచర్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
అక్కడ జనాలు ఉన్నారనే స్పృహ లేకుండానే ఇద్దరు పరుష పదజాలంతో తిట్టుకున్నారు. అలా బయటకు వస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తర్వాత వేరే ఉపాధ్యాయురాలు కూడా వచ్చి తన ప్రత్యర్థిని టార్గెట్ చేశారు. అలా ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు కలిసి వేరే టీచర్‌ను గ్రౌండ్‌లో పడేసి చితక్కొట్టారు.
ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి, ఉపాధ్యాయురాలు అనితా కుమారి ఒకరి నొకరు తిట్టుకున్నారు. తర్వాత కొట్టుకున్నారు. కాంతి కుమారి క్లాస్‌రూమ్ నుంచి బయటకు వెళ్లడం ప్రారంభించగానే, టీచర్ చేతిలో చెప్పుతో ఆమె వెంట పరుగెత్తి వెళ్లింది. కొట్టడం ప్రారంభించింది. మరొక ఉపాధ్యాయులు ఆమెకు సాయం చేసింది. ముగ్గురు కూడా నేలపై కుస్తీ పడ్డారు. ఒకరు చెప్పుతో కొట్టగా, మరొకరు కర్రతో కొట్టారు.
పిల్లలు చూస్తుండగానే ముగ్గురు కొట్టుకున్నారు. చివరకు కొంతమంది వ్యక్తులు వచ్చి వారిని వారించారు. విడిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వ్యక్తిగత గొడవలు ఈ కొట్లాటకు దారి తీసిందని మండల విద్యాధికారి చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేశామని, తదుపరి చర్య కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.
Also Read:హైదరాబాద్‌లో తక్కువ దూరం ప్రయాణించే వారికి గుడ్ న్యూస్- తొలిసారిగా రూట్ పాస్ తీసుకొచ్చిన ఆర్టీసీ
Also Read:గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్!





















