ప్రజాస్వామ్యం లేని చోటే ఇలా జరుగుతుంది, ఖర్గేని G20 విందుకి పిలవకపోవడంపై చిదంబరం అసహనం
G20 Summit 2023: G20 విందుకి ఖర్గేని ఆహ్వానించకపోవడంపై చిదంబరం అసహనం వ్యక్తం చేశారు.
G20 Summit 2023:
చిదంబరం ఫైర్..
G20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులందరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. కానీ...కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి మాత్రం ఈ ఆహ్వానం అందలేదు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. కొందరైతే "కుల రాజకీయాలు" అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం స్పందించారు. ఖర్గేని ఆహ్వానించకపోవడంపై మండి పడ్డారు. ప్రజాస్వామ్యం,ప్రతిపక్షం లేని దేశాల్లో తప్ప ఇలా ఎక్కడా జరగదని విమర్శించారు. ఇంకా భారత్ ఇలాంటి దశకు చేరుకోలేదనే అనుకుంటున్నాని అసహనం వ్యక్తం చేశారు చిదంబరం. ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ప్రధాన ప్రతిపక్ష నేతను రాష్ట్రపతి విందుకి ఆహ్వానించకపోవడం బహుశా మరే దేశంలోనూ జరగదేమో. ప్రతిపక్షం, ప్రజాస్వామ్యం లేని దేశాల్లోనే ఇలా జరుగుతుంది. ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే స్థాయికి భారత్ ఇంకా దిగజారిపోలేదనే అనుకుంటున్నాను"
- పి చిదంబర్, కాంగ్రెస్ ఎంపీ
I cannot imagine any other democratic country's government not inviting the recognised Leader of the Opposition to a state dinner for world leaders
— P. Chidambaram (@PChidambaram_IN) September 9, 2023
This can happen only in countries where there is no Democracy or no Opposition
I hope India, that is Bharat, has not reached a…
అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఖర్గేకి ఆహ్వానం అందకపోవడంపై స్పందించారు. ప్రతిపక్ష నేతలంటే ప్రధాని మోదీకి ఏ మాత్రం లక్ష్యం లేదని మండి పడ్డారు. ఈ వివాదంపై స్వయంగా ఖర్గే కూడా స్పందించారు. ఇప్పటికే పార్టీ తరపున చాలా మంది ఈ విషయంపై మాట్లాడారని, ఇలాంటి రాజకీయాలు పనికి రావని విమర్శించారు.
"నేను ఇప్పటికే ఈ వివాదంపై స్పందించాను. మా పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. బీజేపీ మరీ ఇంత దిగజారిపోవడం సరికాదు. ఇలాంటి రాజకీయాలు అసలు సరికావు"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
Kalaburagi, Karnataka | On not being invited to attend the G-20 Dinner in Delhi today, Congress president Mallikarjun Kharge says "I have already reacted to it. Our party has reacted to this. It is not good politics, and they (Centre) should not do such low-level politics." pic.twitter.com/mICFouRBCq
— ANI (@ANI) September 9, 2023
ఈ విందుకి ఆహ్వానించలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేవలం మంత్రులు, ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందిందని సమాచారం. మాజీ ప్రధానమంత్రులైన డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడనూ ఆహ్వానించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి ఆహ్వానం పంపారు. ఈ విందుకి హాజరవుతున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలూ విధించారు. పార్లమెంట్ హౌజ్‌కి గెస్ట్‌లందరినీ సేఫ్‌గా తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చశారు ఢిల్లీ పోలీసులు. భారత్ మండపంలోని మల్టీ ఫంక్షన్ హాల్లో ఈ విందు జరగనుంది. ఇదే సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలూ జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అతిథులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. మొత్తం 40 మందికిపైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.
Also Read: G20 Summit 2023: బైడెన్‌కి షేప్ ఆఫ్ యూ పాటతో వెల్కమ్, నెటిజన్ల ఆగ్రహం - వైరల్ వీడియో