G20 Summit 2023: బైడెన్‌కి షేప్ ఆఫ్ యూ పాటతో వెల్‌కమ్, నెటిజన్ల ఆగ్రహం - వైరల్ వీడియో
G20 Summit 2023: జో బైడెన్‌కి షేప్ ఆఫ్ యూ పాటతో వెల్‌కమ్ చెప్పడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
G20 Summit 2023:
G20 సదస్సుకి బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీకి వచ్చిన సమయంలో ఆయనకు ఆహ్వానం పలికే క్రమంలో కేంద్రం పెద్ద తప్పు చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయన ఎయిర్‌పోర్ట్‌లో దిగే సమయానికి అక్కడ అసందర్భమైన పాటను పెట్టి కించపరిచారని మండి పడుతున్నాయి. Ed Sheeran కంపోజ్ చేసి పాడిన Shape of You పాటని ప్లే చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేంద్రమంత్రులు బైడెన్‌ని ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పాటలు వినిపించాయి. అదే పాటకు స్టేజ్‌పై డ్యాన్సర్‌లు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. జో బైడెన్ వచ్చినప్పుడే కాదు. అర్డెంటీనా ప్రెసిడెంట్ అల్బర్టో ఫెర్నాండెజ్ వచ్చినప్పుడూ ఇదే పాట వినిపించింది. అయితే...ఈ పాటని యాజిటీజ్‌గా కాకుండా ఇండియన్ మ్యూజిక్‌తో మిక్స్ చేసిన ఓ రెండిషన్‌ని ప్లే చేశారు. అయినా...అందులో లిరిక్స్ అభ్యంతరకరంగా ఉంటాయని, అలాంటి పాటను దేశాధినేతలు వచ్చినప్పుడు పెట్టడమేంటని కొందరు వాదిస్తున్నారు. వీళ్లకు కాంగ్రెస్ నేతలూ మద్దతు పలికారు. ఇది కచ్చితంగా అవమానమే అని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే ఈ పాటలోని లిరిక్స్ కూడా ట్విటర్‌లో షేర్ చేశారు. దేశాధినేతల్ని షేప్ ఆఫ్ యూ పాటతో వెల్‌కమ్ చేయడం దారుణం అని పోస్ట్ పెట్టారు. కొందరు నెటిజన్లు కూడా దీనిపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. చక్కగా మన ఇండియన్ పాటేదైనా పెట్టుకోవచ్చుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
#WATCH | G-20 in India: US President Joe Biden arrives in Delhi for the G-20 Summit
— ANI (@ANI) September 8, 2023
He was received by MoS Civil Aviation Gen (Retd) VK Singh pic.twitter.com/U0qyG0aFcp
We are welcoming foreign heads of state with ‘Shape of you’ by Ed Sheeran?!?!
— Supriya Shrinate (@SupriyaShrinate) September 8, 2023
Lyrics that follow
‘Grab on my waist and put that body on me.…I’m in love with your body. Last night you were in my room. And now my bedsheets smell like you’
Embarrassing at the least
📷 @ANI pic.twitter.com/YYAB7bihlV
అమెరికా అధ్యక్షుడి భద్రతకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జోబిడైన్ భద్రత కోసం అనేక రకాల ప్రోటోకాల్స్‌ను అధికారులు తూచా తప్పకుండా పాటించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా అతడు బస చేసే హోటల్ నుంచి అత్యాధునిక వసతులతో కూడిన ఆసుపత్రి కేవలం 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకునేలా ఉండాలి. సమీపంలోని అన్ని ఆసుపత్రుల జాబితా భద్రతా సిబ్బంది దగ్గర ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అధ్యక్షుడిని నిమిషాల వ్యవధిలోనే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఈ చర్యలు తీసుకుంటారు. అలాగే ఆసుపత్రుల్లోని ట్రామా సెంటర్లు ఎప్పుడు అలర్ట్‌గా ఉంటాయి.
Also Read: G20 Summit 2023: ఢిల్లీ డిక్లరేషన్ని ఆమోదించిన G20 నేతలు, ప్రధాని మోదీ కీలక ప్రకటన