G20 Summit 2023: ఢిల్లీ డిక్లరేషన్ని ఆమోదించిన G20 నేతలు, ప్రధాని మోదీ కీలక ప్రకటన
G20 Summit 2023: G20 ఢిల్లీ డిక్లరేషన్పై అందరు సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు.
G20 Summit 2023:
ఢిల్లీ డిక్లరేషన్కి ఆమోదం..
తొలిరోజు G20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ డిక్లరేషన్కి (Delhi Declaration) సభ్యులందరూ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కొంత వరకూ భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ చివరకు అంతా ఏకాభిప్రాయంతో డిక్లరేషన్ని స్వాగతించినట్టు స్పష్టం చేశారు. ఇదంతా సమష్టి కృషి వల్లే సాధ్యమైందని ప్రధాని తెలిపారు.
"ఇప్పుడే నేనో శుభవార్త విన్నాను. మా టీమ్ కృషి వల్ల న్యూ ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో అందరు నేతలూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ డిక్లరేషన్కి ఆమోదం తెలపాలని నేను ప్రతిపాదించాను. అందరూ అందుకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా G20 షెర్పాలు, మంత్రులతో పాటు ఇది సాధ్యమయ్యేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | G-20 in India: PM Narendra Modi says, " I have received good news. Due to the hard work of our team, consensus has been built on New Delhi G20 Leaders' Summit Declaration. My proposal is to adopt this leadership declaration. I announce to adopt this declaration. On this… pic.twitter.com/7mfuzP0qz9
— ANI (@ANI) September 9, 2023
ఢిల్లీ డిక్లరేషన్లో కీలక అంశాలివే..
1. బలమైన, సమ్మిళితమైన అభివృద్ధి
2.సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు మరింత వేగంగా పని చేయడం.
3. సుస్థిర భవిష్యత్ కోసం గ్రీన్ డెవలప్మెంట్పై దృష్టి సారించడం.
The #NewDelhiLeadersDeclaration focuses on -
— Amitabh Kant (@amitabhk87) September 9, 2023
▶️Strong, Sustainable, Balanced, and Inclusive Growth
▶️Accelerating Progress on #SDGs
▶️Green Development Pact for a Sustainable Future
▶️Multilateral Institutions for the 21st Century
▶️Reinvigorating Multilateralism#G20India
పెట్రోల్లో 20% ఇథనాల్ని కలపాలన్న ప్రతిపాదన తీసుకొచ్చింది భారత్. తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని స్పష్టం చేసింది. ఇందుకోసం లక్షల కోట్ల డాలర్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలే కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ వెల్లడించారు. అంతర్జాతీయంగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. అంతకు ముందు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. G20 సమావేశాలతో సమాంతరంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సదస్సులో "ఒకే పుడమి" థీమ్పైనా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ ఈ విషయంలో ఎన్నో చర్యలు చేపట్టిందని వెల్లడించారు. మానవ కేంద్రంగానే అభివృద్ధి జరగాలని, భారత సంస్కృతిలో ఇది భాగమని తెలిపారు One Earth థీమ్పై భారత్ ఎన్నో విధాలుగా చర్యలు తీసుకుందని వాటిలో LiFE Mission ఒకటని వివరించారు. వీటితో పాటు International Year of Millets అంశాన్నీ ప్రస్తావించినట్టు ప్రధాని వెల్లడించారు.