By: ABP Desam | Published : 23 Oct 2021 09:10 AM (IST)|Updated : 23 Oct 2021 09:12 AM (IST)
Edited By: Sai Anand Madasu
ప్రతీకాత్మక చిత్రం
కొత్త ఐటీ చట్టాన్ని సవాలు చేస్తూ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి విదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ భారత కొత్త ఐటీ చట్టాలను సవాలు చేయలేవని కేంద్రం అఫిడవిట్ లో పేర్కొంది. ఫేస్‌బుక్‌తో సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతించే వాట్సాప్ గోప్యతా విధానం, జాతీయ భద్రత లాంటి వాటికి హాని కలిగిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
భారత్‌లో వ్యాపారం చేస్తున్న సోషల్‌మీడియా సంస్థలు.. భారత చట్టాలను గౌరవించాల్సిందేనని కేంద్రం అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం కోరిన సమాచారం ఇవ్వాల్సిందేనని తెలిపింది. కొత్త ఐటీ నిబంధనల్లోని రూల్ నంబర్ 4(2) ప్రకారం హింసకు ప్రేరేపించే సందేశాలు, తప్పుడు వార్తలు, వదంతుల మూలాలను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దర్యాప్తు సంస్థలు కోరినప్పుడు ఆ సమాచారాన్ని ఇవ్వాలి అని ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చెప్పింది.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానమని, మూలాలను గుర్తించడం తమ విధానాలకు విరుద్ధమని వాట్సాప్ తన పిటిషన్‌లో పేర్కొంది. అయితే వాట్సాప్ 2016 యూజర్ పాలసీ.. 2021లో సవరించిన యూజర్ పాలసీని గమనించాలని కేంద్రం కోరంది. 'యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తన మాతృ సంస్థ ఫేస్‌బుక్, ఇతర థర్డ్ పార్టీ సంస్థలకు అందజేయవచ్చని ఉంది. వ్యాపార ధోరణిలో యూజర్ల డేటాను ఇతరులకు ఇవ్వవచ్చని తెలుస్తుంది. అయితే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు అర్థమేముంది?’. కోట్ల కోట్ల రూపాయల విలువ ఉన్న ఆ సంస్థకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానాన్ని నష్టం చేయకుండా.. మెసేజ్ల మూలాలను కనుగొనే వ్యవస్థను అమలు చేయడం ఏమంత పెద్ద పని కాదు.' అని కేంద్రం అఫిడవిట్‌లో తెలిపింది. భారత దర్యాప్తు సంస్థలు కోరే సమాచారాన్ని అందజేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరింది.
Also Read: WhatsApp Chat Update: అప్పట్లో రియా.. ఇప్పుడు అనన్యా.. అసలు ఈ వాట్సాప్ ఛాట్ ఎలా లీకవుతోంది?
Also read: సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతి రైస్‌తో బరువు తగ్గే ఛాన్స్... నిజమేనా?
Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Also read: బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేయకండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Mysterious metal balls raining : గుజరాత్లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !
Salary In Gold : ఆ కంపెనీలో జీతం క్యాష్ కాదు గోల్డ్ - వాళ్ల జీతం బంగారమైపోయింది !
Asaduddin Owaisi on Gyanvapi: మరో మసీదును ముస్లింలు వదులుకోరు: ఓవైసీ
One Block Board Two Classes : ఒక్క క్లాస్ రూమ్లో ఒకే సారి రెండు తరగతులకు పాఠాలు చెప్పడం చూశారా ? బీహార్ నుంచి చూపిస్తున్నాం చూడండి
Delhi Buldozer politics : ఢిల్లీలో 80 శాతం అక్రమ నిర్మాణాలే, కూల్చేస్తారా? - బీజేపీని ప్రశ్నించిన కేజ్రీవాల్ !
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్కు మహిళల సూటిప్రశ్న