By: ABP Desam | Updated at : 16 Aug 2021 09:06 PM (IST)
పెట్రోల్ ధరలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(ఫైల్ ఫొటో)
పెట్రోలు ధర వంద రూపాయల దాటేసింది. వాహనదారులు భయపడిపోతున్నారు. కొన్ని రోజులుగా గ్యాప్ లేకుండా పెరిగిన ధరలతో సామాన్యూడు బంకు వెళ్లి.. పెట్రోలో పోయించుకునే ముందు బడ్జెట్ లెక్కలు వేసుకునే పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఈ పెట్రోల్ ధరలపై మాట్లాడిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ.. పాద మాటలే చెప్పారు. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని వివరించారు.
Also Read: Imran Khan Endroses Taliban: పాక్ ప్రధాని రూటే సెపరేటు.. బానిస సంకెళ్లు తెంచేశారట!
యూపీఏ ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ బిల్లులు, రూ.37,340 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించలేదని వెల్లడించారు.
ఐదేళ్ల కాలంలో ఆయిల్ బాండ్లపై ఎన్డీఏ ప్రభుత్వం రూ.60 వేల కోట్ల వడ్డీ చెల్లించినట్లు సీతారామన్ తెలిపారు. ఇంకా రూ.1.3 లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. యూపీఏ హయాంలో రూ.1.44 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్ల జారీ చేయడంతో అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.. అయితే... ఆయిల్ బాండ్ల భారం తమ ప్రభుత్వంపై పడిందని కేంద్రమంత్రి తెలిపారు. వాటి కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేకపోతున్నట్టు చెప్పారు. ప్రస్తుతమైతే.. ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించే సమస్యే లేదని చెప్పారు.
Also Read: Afghan Ghani Cash : ఘనీ మామూలోడు కాదు.. పారిపోయేటప్పుడు ఎంత సొమ్ము తీసుకెళ్లారో తెలుసా..!?
తమిళనాడులా కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుందా అని రిపోర్టర్ ప్రశ్న అడిగారు. దీనికి సీతారామన్ సమాధానం ఇచ్చారు.
మేం గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అన్నింటిని జాబితా చేస్తూ 2014లో శ్వేత పత్రాన్ని విడుదల చేసి ఉండాల్సింది. చమురు బాండ్లు దానిలో పెద్ద భాగం. యూపీఏ ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు చమురు బాండ్ల జారీ చేయడం వల్ల ఇంధన ధరలు తగ్గాయి. కానీ ఆయిల్ బాండ్ల భారం మా ప్రభుత్వంపై పడింది.. ఇప్పటికీ ఆ భారాన్ని ప్రజలు మోస్తున్నారు.
- నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి
లీటరు పెట్రోల్ రేటుపై రూ.3 ఇంధన పన్నును తగ్గిస్తూన్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 13న ప్రకటించింది. ఈ తగ్గింపు వల్ల ఆ రాష్ట్ర ఖజానా మీద ఏడాదికి రూ.1,160 కోట్ల భారం పడనుంది.
Gyanvapi Mosque Case: జ్ఞాన్ వాపి మసీదు కేసులో వాదనలు పూర్తి- తీర్పు రేపటికి రిజర్వ్ చేసిన వారణాసి కోర్టు
Quad Summit 2022: అన్ని దేశాలకు అనుకూలమైన ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ కోసం భారతదేశం పని చేస్తుంది: ప్రధాని మోదీ
India Railways: భారత్‌లో భారీగా రైల్వే ట్రాక్‌ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు
Bihar Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !
Monkeypox Virus Advisory: మంకీపాక్స్ వైరస్ ముప్పుపై కేంద్రం అప్రమత్తం- కేరళ, మహారాష్ట్ర, దిల్లీకి కీలక ఆదేశాలు
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్‌రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్