News
News
X

హైదరాబాద్‌ నుంచి యూపీ వెళ్తున్న బస్‌కు ప్రమాదం- 14 మంది మృతి, 40 మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులను కలిపే జాతీయ రహదారి 30పై ఘరో ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంతో 14 మంది మరణించారు.

FOLLOW US: 

మధ్యప్రదేశ్‌లోని రేవాలో మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులను కలిపే జాతీయ రహదారి 30పై ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం-శనివారం (అక్టోబర్ 21-22) మధ్య రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో జబల్‌పూర్ నుంచి రేవా మీదుగా ప్రయాగ్ రాజ్  వెళ్తోన్న బస్‌ ప్రమాదంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సోహగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించారు. క్షతగాత్రులను త్యోంథర్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు.

సుహాగి హిల్ సమీపంలో బస్సు, ట్రాలీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. గాయపడిన 40 మందిలో 20 మందిని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లోని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరి గోరఖ్ పూర్ కు చేరుకోవాల్సి ఉందని ఎస్పీ తెలియజేశారు. బస్సులో ఉన్నవారు యుపి, బీహార్, నేపాల్ నుంచి వచ్చారు.

సుహాగి కొండపై నుంచి దిగుతుండగా ట్రాలీ మొదట ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని, ఆ తర్వాత ఆ ట్రక్‌ను బస్సు ఢీకొందని రేవా ఎస్పీ తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్, గోండా, గోరఖ్ పూర్ వాసులుగా సమాచారం అందుతోంది.

సమాచారం ప్రకారం బస్సులో 100 మందికి పైగా ఉన్నారు. పండుగ రోజున ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

News Reels

ప్రమాదం జరిగిన తరువాత, బస్సు, ట్రక్కు అక్కడికక్కడే ఉన్నాయని, మూడో వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. సమీపంలోని టోల్ ప్లాజాలోని సిసిటివి కెమెరాల సహాయంతో మూడో వాహనం ఎటువైపుకు వెళ్లిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి, గాయపడిన వారు కూలీలుగా చెబుతున్నారు. 

ఈ ప్రమాదం గురించి ఉత్తరప్రదేశ్, బీహార్ లోని అధికారులకు సమాచారం అందించారు. మృతుడి ఆచూకీ త్వరలోనే వెల్లడిస్తాం. బ్రేకులు వేయకపోవడం వల్లే  ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం కారణంగా బస్సులో ఇరుక్కుపోయిన వారిలో కొందరి చేతులు, కాళ్లు తెగిపోయాయి. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Published at : 22 Oct 2022 09:01 AM (IST) Tags: India News Bus accident Rewa News

సంబంధిత కథనాలు

26/11 Mumbai Attack: ఆ మారణహోమం నుంచి పాఠం నేర్చుకున్న భారత్, ఉగ్రపోరులో మారిన వ్యూహాలు

26/11 Mumbai Attack: ఆ మారణహోమం నుంచి పాఠం నేర్చుకున్న భారత్, ఉగ్రపోరులో మారిన వ్యూహాలు

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Constitution Day 2022: మన రాజ్యాంగం గురించి 10 ఆసక్తికర విశేషాలివే, ప్రస్తుతం ఒరిజినల్ కాపీ అక్కడ చాలా సేఫ్ !

Constitution Day 2022: మన రాజ్యాంగం గురించి 10 ఆసక్తికర విశేషాలివే, ప్రస్తుతం ఒరిజినల్ కాపీ అక్కడ చాలా సేఫ్ !

Mysuru Bajrang Dal: హిందూ యువతితో ప్రయాణించిన ముస్లిం యువకుడు, దాడి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు

Mysuru Bajrang Dal: హిందూ యువతితో ప్రయాణించిన ముస్లిం యువకుడు, దాడి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి