News
News
X

Doctors Sloppy Handwriting : డాక్టర్స్ రాసే మందుల చీటీ మనకెందుకు అర్థం కాదు?

Doctors Sloppy Handwriting :ఆనంద్ మహీంద్రా చేసిన ఓ ఫన్నీ ట్వీట్ వెనుక పెద్ద కథే ఉంది. వైద్యులు రాసే ప్రిస్ర్కిప్షన్ ఎందుకు అలా అర్థం కాకుండా ఉంటాయో తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

Doctors Sloppy Handwriting  : ఆనంద్ మహీంద్రా పెట్టిన ఓ ట్వీట్ పై చర్చ జరుగుతోంది. చేతిరాత ఇలా మారిపోతుందని ఓ వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. అసలు డాక్టర్స్ రైటింగ్ ఎందుకు అలా ఉంటుందనే అంశంపైనే ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో చర్చ నడుస్తోంది. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఎందుకు అర్థం కాదు, మెడికల్ షాపు వాళ్లకే ఎందుకు అర్థం అవుతుందని ప్రశ్న తలెత్తుతుంది. 

1. గొలుసుకట్టు రాత

చాలా మంది డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లో గొలుసుకట్టు రాతలే ఉంటాయి. మొదటి అక్షరం అర్థం చేసుకోవచ్చు ఇక చివరి అక్షరం వరకూ వాళ్లేం రాస్తున్నారో అర్థం కాదు. చివర్లో మళ్లీ ఏదో లెటర్ అర్థమై కానట్లు రాస్తారు. చాలా మంది అనుకునేది ఏంటంటే డాక్టర్ల చేతిరాత బాగోదు అని. కానీ అది నిజం కాదు. వాళ్లు మెడిసిన్ చదివినప్పుడు బాగానే రాస్తుండొచ్చు. బట్ మెడిసిన్ అనేది స్టడీస్ లోనే టఫ్ కోర్సుల్లో ఒకటి. చాలా అంశాలు రాసుకోవాల్సి ఉంటుంది. పదుల సంఖ్యలో రికార్డులు, థీసిస్ లు, ఇంటర్నల్, ఎక్స్ ట్రనల్ ఇలా ఒకటి రెండు కాదు అనేక వందల పరీక్షలు రాస్తారు వైద్యవిద్య పూర్తయ్యే లోపు. ఫలితంగా వాళ్ల చేతిరాతలో చాలా మార్పులు వచ్చేస్తాయి. వీలైనంత తక్కువ టైంలో రాయటానికి అనువుగా ఉండేలా చాలా పదాలను స్కిప్ చేసేస్తూ రాయటం మొదలు పెడతారు. అదో కోడ్ లాంగ్వేజ్ అని చూసేవాళ్లకి అనుమానం వచ్చేలా మారిపోతుంది ఆ రాత.

2. పనిభారం

పోనీ డాక్టర్లు అయ్యాక ఏమన్నా రాయటం తగ్గుతుందా అంటే లేదు. మీరు గమనించండి ప్రతీ డాక్టర్ కూడా రోజులో చాలా సేపు రాస్తూనే ఉంటారు. తన దగ్గరకు వచ్చిన రోగులు చెప్పే ప్రతీ పాయింట్ ను రికార్డు చేస్తుంటారు. మెడికల్ రికార్డ్స్ ను నింపుతుంటారు. మన దేశంలో సగటున ఓ ఎంబీబీఎస్ డాక్టర్  రోజుకు ముఫ్పై నుంచి ముఫ్పై ఐదు మంది పేషెంట్లకు వైద్యం అందిస్తారంట. బిజీగా ఉండే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా రాసే అక్షరాలపై పట్టు కోల్పుతుంటారు.

3. చేతుల్లో సత్తువ తగ్గటం

అదేంటీ డాక్టర్లకే సమస్యలు ఉంటాయా? అంటే. వాస్తవానికి అదేం అంత పెద్ద సమస్య కాదు కానీ రాసే విషయంలోనే అది సమస్య. వాళ్లకు రాయాలని ఉన్నా అక్షరాలు రాస్తున్నప్పుడు అవి జారిపోతుంటాయి. పట్టు కోల్పోవటం లాంటి సమస్యే ఇది. తెలియకుండానే అక్షరాలు వేగంగా పడిపోతుంటాయి.ఫలితంగా గొలుసు కట్టు రాతల్లా కనిపిస్తుంటాయి. గంటల తరబడి రోజుకు రాస్తూ ఉండటం..అలా ఏళ్లకు ఏళ్లు రాతను ప్రాక్టీస్ చేస్తున్న కారణంగా తెలియకుండానే వేళ్లు సత్తువ కోల్పోతాయని పరిశోధనల్లో తేలింది.

4. రోగికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవటం

మన దేశంలో వైద్యులు, రోగుల నిష్పత్తి శాతం చూస్తే చాలా తక్కువ. ప్రతీ వెయ్యిమందికి కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే ఉంటున్నారు. సో ప్రతీ రోగికి ఎక్కువ సమయాన్ని కేటాయించటం వైద్యులకు కష్టమైన పనే. రోగి సమస్యలను శ్రద్ధగా వింటూ..వాళ్లు చెబుతున్నది జాగ్రత్తగా నోట్ చేస్తూ...ట్రీట్ మెంట్ అందించాల్సి ఉంటుంది అది కూడా వేగంగా. ఫలితంగా వైద్యుల చేతిరాతపై ఈ అంశం ప్రభావం చూపిస్తోందని చెబుతారు.

5. స్పెల్లింగులతో తిప్పలు

చాలా సార్లు వైద్యులు స్పెల్లింగుల విషయంలో డిస్ లెక్సియా గురవుతారని మరో పరిశోధనలో తేలింది. డిస్ లెక్సియా అంటే అక్షరాలు తారుమారు అవటం. రోజుకు కొన్ని వందల రకాల మందులు రాసే డాక్టర్లు ప్రతీ స్పెల్లింగునూ గుర్తు పెట్టుకోవటం కష్టం కనుక షార్ట్ కట్ లో రాసేందుకు అలవాటు పడతారని పరిశోధనల్లో తేలింది. కానీ డాక్టర్ ఏం రాసున్నారో మందుల షాపు వ్యక్తికి ఎలా అర్థం అవుతుంది. ఇందులో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి చాలా ఆసుపత్రులకు డెడికేటెడ్ మెడికల్ షాపులు ఉంటాయి. కనుక ఆ డాక్టర్ రాసే మందులు ఏంటో కాలక్రమేణా మెడికల్ షాపులో చేసిన వారికి అర్థమైపోతుంటుంది. రెండు కొన్ని సందర్భాల్లో దేని కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లారో ప్రిస్క్రిప్షన్ చూస్తూనే అడుగుతారు మెడికల్ షాపు వాళ్లు. కాంటెక్ట్స్ బట్టి రాసిన మెడిసిన్స్ ఇవి ఉండవచ్చు అని అర్థం చేసుకోగలుగుతారు.

6. ఇబ్బందులు ఉన్నాయి

ఇదంతా వినటానికి సాఫీగానే సాగుతున్నట్లు ఉన్నా ఇందులో ఇబ్బందులు ఉన్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లను సరిగా అర్థం చేసుకోలేకపోవటం వలన ఏడాదిలో కొన్ని మరణాలు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నాయి. US లో మెడికల్ ఎర్రర్స్ కారణంగా ఏడాదిలో రెండు లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికాలో మరణాలకు కారణమవుతున్న వాటిలో మెడికల్ ఎర్రర్స్ ది మూడో స్థానం. వాటిలో ఎక్కువ శాతం ప్రిస్క్రిప్షన్ ను సరిగా అర్థం చేసుకోకపోవటమే. ఇండియాలో కూడా ఈ తరహా మరణాలు తక్కువేం కాదు. అందుకే చాలా న్యాయస్థానాలు ఆసుపత్రులు ఈ ప్రిస్ర్కిప్షన్ విధానాన్ని అవలంబించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

 

Published at : 04 Sep 2022 10:48 PM (IST) Tags: Anand Mahindra tweet Doctors handwriting doctors prescription Medical Prescription

సంబంధిత కథనాలు

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!

EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!

COVID-19 Mock Drills: రాష్ట్రాలను అలెర్ట్ చేసిన కేంద్రం, వచ్చే నెల కొవిడ్ మాక్‌ డ్రిల్ - కొత్త మార్గదర్శకాలు జారీ

COVID-19 Mock Drills: రాష్ట్రాలను అలెర్ట్ చేసిన కేంద్రం, వచ్చే నెల కొవిడ్ మాక్‌ డ్రిల్ - కొత్త మార్గదర్శకాలు జారీ

SSC MTS Final Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 2021 తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 7494 మంది ఎంపిక!

SSC MTS Final Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 2021 తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 7494 మంది ఎంపిక!

RBI: ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

RBI: ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?