అన్వేషించండి

Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..

Tamil Nadu elections 2026 DMK candidates: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే తమ తొలి జాబితాను విడుదల చేసింది. సీఎం ఎం.కె. స్టాలిన్ నుండి ఉదయనిధి వరకు పలువురు ప్రముఖ నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార డీఎంకే కూటమి మధ్య పొత్తు కుదిరింది. అధికార డీఎంకే (DMK) తన మిత్రపక్షాలతో సీట్ల పంపకాలను పూర్తి చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిగిలిన 70 స్థానాలను తన మిత్రపక్షాలకు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు ఫిక్స్ చేశారు. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన విడుదలైంది.

అధికారంలో ఉన్న డీఎంకె (DMK) 164 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ అభ్యర్థుల జాబితాలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి పేర్లు ఉన్నాయి. పార్టీ మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు మళ్ళీ అవకాశం కల్పించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియ మే 4న ఉంటుంది. 

స్టాలిన్- ఉదయనిధి ఎక్కడి నుండి పోటీ చేస్తారు?

డిఎంకె అధినేత స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేశారు. తాను మరోసారి కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఉదయనిధి కూడా చెపాక్- ట్రిప్లికేన్ స్థానం నుంచి మళ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు మంత్రులు దురై మురుగన్ (డిఎంకె ప్రధాన కార్యదర్శి), కె.ఎన్. నెహ్రూ, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, తంగం తెన్నరసు, మా సుబ్రమణియన్, ఈవీ వేలులకు పార్టీ మళ్లీ అవకాశం ఇచ్చింది.

పన్నీర్ సెల్వం బరిలోకి దిగేది ఎక్కడంటే.. 

AIADMK నుండి బహిష్కరణకు గురైన తర్వాత డిఎంకెలో చేరిన మాజీ సీఎం ఓ. పన్నీర్ సెల్వానికి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహించిన బోదినాయకనూర్ నియోజకవర్గం నుండే అవకాశం ఇచ్చారు. డీఎంకెలో చేరిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పన్నీర్ సెల్వం సహచరులు పాల్ మనోజ్ పాండియన్, ఆర్. వైతిలింగానికి కూడా టికెట్లు దక్కాయి. మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీ కోయంబత్తూరు సౌత్ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

28 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్

అంతకుముందు డిఎంకె, దాని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం ఫార్ములా ఖరారైంది. గరిష్టంగా డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. డిఎంకె మిత్రపక్షమైన కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేస్తుంది. తర్వాత  వీసీకే (VCK), డీఎండీకే (DMDK) సహా ఇతర పార్టీలు పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. సీట్ల పంపకం పూర్తయిన ప్రకారం కాంగ్రెస్.. పొన్నేరి, శివకాశి, ఈరోడ్ ఈస్ట్, విలవంకోడ్, కారైకుడి ఉన్నాయి. ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు 10 సీట్లు వచ్చాయి. వాటిలో ముఖ్యమైన విరుధాచలం, పల్లవరం ఉన్నాయి.

తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే పార్టీకి కట్టుమన్నార్ కోయిల్, పన్రుట్టి, తిండివనం సహా 8 సీట్లు వచ్చాయి. సీపీఎంకు పద్మనాభపురం, పళని సీట్లు లభించాయి. సీపీఐ పార్టీ తళ్ళి, భవానీసాగర్ (రిజర్వ్డ్) తో సహా ఇతర స్థానాల నుండి పోటీ చేస్తుంది. రెండు వామపక్ష పార్టీలకు 5 చొప్పున సీట్లు కేటాయించారు. వైకో నేతృత్వంలోని ఎండిఎంకె (MDMK) తో సహా ఇతర మిత్రపక్షాలకు కూడా డిఎంకె సీట్ల పంపకం చేసింది. MDMK నాలుగు స్థానాల్లో బరిలోకి దిగనుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget