అన్వేషించండి

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ రాజీనామా - కారణమేంటంటే?

Jagdeep Dhankhar:ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు.

Jagdeep Dhankhar: అనారోగ్యకారణాలతో ఉపరాష్ట్రపతివికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారు. ఉదయం సభకు హాజరై ధన్‌ఖడ్‌ సాయంత్రానికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఇవాళే(సోమవారం) ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సమావేశాలు తొలిరోజే సజావుగా సాగలేదు. తొలిరోజు సమావేశాలు వాయిదా అనంతరం ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. 

ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలిపారు. ఇన్నాళ్లు తనకు సహకారం అందించిన రాష్ట్రపతికి,  తనకు పదవి ఇచ్చిన ప్రధానమంత్రి మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకి, బీజేపీ అధినాయకత్వానికి ధన్‌ఖడ్‌ ధన్యవాదాలు చెప్పారు.  

ఆరోగ్య కారణాలను పేర్కొంటూ లేఖ

అనారోగ్య కారణాలను పేర్కొంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (ఎ) కింద జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఏమన్నారంటే,"ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి, వైద్య సలహాలను అనుసరించడానికి నేను తక్షణమే భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నాను. మన గొప్ప ప్రజాస్వామ్యంలో ఉపరాష్ట్రపతిగా నేను పొందిన అమూల్యమైన అనుభవాలకు నేను చాలా కృతజ్ఞుడను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, మద్దతు అమూల్యమైనది. నా పదవీకాలంలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను."

జగదీప్ ధన్‌ఖడ్‌ ఇలా రాశారు, "పార్లమెంటులోని గౌరవనీయ సభ్యులందరి నుంచి నాకు లభించిన ప్రేమ, నమ్మకం, గౌరవం నా జీవితాంతం నా హృదయంలో నిలిచి ఉంటాయి. పదవీ కాలంలో భారతదేశ ఆర్థిక పురోగతి, అపూర్వమైన అభివృద్ధిని వీక్షించడం, చర్చల్లో పాల్గొనడం నాకు అదృష్టం సంతృప్తినిచ్చింది."

వర్షాకాల సమావేశాల సమయంలో రాజీనామా 

జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ ఆగస్టు 6, 2022న భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. వర్షాకాల సమావేశాల సమయంలో ఆయన రాజీనామా చేశారు. సోమవారం (జూలై 21, 2025) వర్షాకాల సమావేశాల మొదటి రోజున, రాజ్యసభలోని రాజకీయ పార్టీలు ఉద్రిక్తతను తగ్గించి, సామరస్య వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు. నిరంతర ఘర్షణ స్థితిలో సంపన్న ప్రజాస్వామ్యం మనుగడ సాగించదని ఆయన అన్నారు.

రాజ్యసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "రాజకీయాల సారాంశం సంభాషణ, ఘర్షణ కాదు. వివిధ రాజకీయ పార్టీలు వేర్వేరు మార్గాలను అనుసరించవచ్చు, కానీ అందరి లక్ష్యం జాతీయ ప్రయోజనాలే. భారతదేశంలో ఎవరూ దేశ ప్రయోజనాలను వ్యతిరేకించరు" అని అన్నారు. డిసెంబర్ 2024లో, సభలో గందరగోళం సృష్టిస్తున్న ప్రతిపక్ష ఎంపీలకు జగదీప్ ధన్‌ఖడ్‌, "నేను రైతు బిడ్డను, నేను బలహీనతను చూపించను, దేశం కోసం చనిపోతాను" అని అన్నారు. ఈ ప్రకటనను ఆయన పదవీకాలంలో కూడా కచ్చితంగా ప్రస్తావించనున్నారు.

Image

రాజస్థాన్‌కు చెందిన ధన్‌ఖడ్‌ 1989లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలి ప్రయత్నంలోనే లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నాటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ మంత్రివర్గంలో కూడా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారా సహాయ మంత్రిగా పనిచేశారు. 1989లో లోక్‌సభకు ఎన్నికైన ఆయన 91 వరకు కేంద్రమంత్రిగా కొనసాగారు. తర్వాత రాజస్థాన్‌ 1993లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1998 వరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ లెజిస్టేటివ్ లీడర్‌గా కొనసాగారు. అప్పటి నుంచి బీజేపీ ఎదుగుదల కోసం శ్రమించారు. తన శ్రమకు గుర్తింపుగా 2019జులైలో పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా మోదీ సర్కారు పంపించింది. ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. జులై 2022వరకు ఉన్నారు. అప్పుడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ధన్‌ఖడ్‌ను మోదీ ప్రభుత్వం ఉపరాష్ట్రపతిగా నియమించింది. ఇన్నాళ్లు ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్‌గా సేవలు అందిస్తూ వచ్చారు. 

జగదీప్‌ ధన్‌ఖడ్‌ 18మే 1951లో రాజస్థాన్‌లోనిఝంజున్నూలోని కితానలో జన్మించారు. వ్యవసాయకుటుంబంలో జన్మించిన ధన్‌ఖడ్‌... ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. తర్వాత న్యాయవాద డిగ్రీ కూడా తీసుకున్నారు. తర్వాత న్యాయవాదిగా సుప్రీంకోర్టులో కూడా పనిచేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Maruti Brezza లేదా Nissan Magnite లలో ఏ SUV బెటర్- ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Maruti Brezza లేదా Nissan Magnite లలో ఏ SUV బెటర్- ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Embed widget