Delhi Kanjhawala Accident: ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం- స్కూటీపై ఉన్నది ఒక్కరు కాదు ఇద్దరు!
ఢిల్లీ కంఝవాలా ప్రమాదంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకు మరో కొత్త విషయం తెలిసింది. స్కూటీపై వెళ్లింది ఒక్కరు కాదు ఇద్దరని తేలింది.
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన కంఝవాలా కేసులో మరో కీలక విషయం వెలుగుచూసింది. న్యూ ఇయర్ రాత్రి కారు ఢీకొని 12 కిలోమీటర్లు రహదారిపై ఈడ్చుకెళ్లిన యువతి ప్రమాద సమయంలో ఒంటరిగా లేదని తేలింది. ఆ యువతితోపాటు స్కూటీపై స్నేహితురాలు ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. పోలీసులు కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితురాలితోపాటు కూర్చొన్న వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్టు గుర్తించారు.
బాధితురాలు, ఆమె స్నేహితురాలు రాత్రి సమయంలో స్కూటీపై వెళుతున్నట్లు సిసిటివి ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఫుటేజ్‌లో బాధిత యువతి పింక్ టీ షర్టులో ఉండగా, ఆమె స్నేహితురాలు ఎరుపు టీ షర్టులో ఉన్నారు. బాధితురాలి స్నేహితురాలు స్కూటీ నడుపుతుండగా, ఆమె వెనుక కూర్చున్నారు.
మధ్యలో ఓ చోట తాను నడుపుతానంటూ బాధిత యువతి. వద్దని స్నేహితురాలు వారిస్తూ... మాట్లాడుకుంటూ ఇద్దరూ వెళ్తారు. కాస్త దూరం వెళ్లాక... స్కూటీని బాధిత యువతికి ఇచ్చేస్తుంది స్నేహితురాలు. అక్కడ నుంచి ఆమె స్కూటీని నడుపుకొని కొంత దూరం వెళ్తుంది. స్నేహితురాలు వెనుక కూర్చొని ఉంటుంది.
ఇలా వెళ్తున్న క్రమంలోనే సుల్తాన్ పురి ప్రాంతంలో ప్రమాదం జరుగుతుంది. ఇద్దరూ కిందపడిపోతారు. కాస్త దూరంలో పడిన బాధిత యువతి స్నేహితురాలు స్వల్ప గాయాలతో అక్కడి నుంచి పారిపోతుంది. బాధితురాలి అదృష్టం బాగా లేక... ఆమె కింద పడిపోయి కాస్త గాయాలు ఎక్కువ కావడంతోపాటు... కాలు కారు యాక్సిల్‌లో ఇరుక్కుంటుంది.
యువతి కాలు ఇరుక్కుపోయిందన్న సంగతి గమనించిన కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ముందుకు పోనిస్తారు. వెళ్తున్న క్రమంలోనే ఆమె శరీర భాగాలు ఛిద్రమై చనిపోతుంది. అయినా దాన్ని గమనించిన వాళ్లు.... కారును రాత్రంతా తిప్పుతూనే ఉన్నారు.
చివరకు కంఝవాలా ప్రాంతంలో కారులో తిరిగి తిరిగి రక్తపు ఒంటినిండా గాయాలతో రక్తమోడిన శరీరంతో పడిపోతుంది. దాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ యువతి చనిపోయింది.
ప్రమాదం జరిగిన తరువాత ఎంక్వయిరీ చేసిన పోలీసులకు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే... మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిన్నటి వరకు బాధిత యువతి ఒక్కరే స్కూటీలో వెళ్లారని చాలా మంది అనుకున్నారు. కానీ మరిన్ని సీసీటీవీ దృశ్యాలు చూసిన పోలీసులకు ఇద్దరు వెళ్లినట్టు తెలిసింది.
ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి సోమవారం (జనవరి 2) కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 5 రోజుల రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా, కోర్టు 3 రోజుల రిమాండ్ కు ఆమోదం తెలిపింది న్యాయస్థానం.