Delhi Floods: అసలే వరదలు ఆపై మరోసారి భారీ వర్షం, దయనీయంగా ఢిల్లీ పరిస్థితి
Delhi Floods: ఢిల్లీలో వరదలు సతమతం చేస్తుండగానే మరోసారి భారీ వర్షం కురిసింది.
Delhi Floods:
వీడని వరద ముప్పు..
ఢిల్లీని వరద ముప్పు వదిలిపోవడం లేదు. యమునా నది శాంతించినట్టే కనిపిస్తున్నా వరద నీళ్లు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు చాలడం లేదు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని స్థితిగతులపై ఆరా తీశారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. మూడు రోజుల పాటు కురిసిన వర్షానికి యమునా నది నీటిమట్టం భారీగా పెరిగింది. ఇక హత్నికుండ్ బ్యారేజ్ గేట్లు ఎత్తి వేయడం వల్ల ఈ వరద నీరు మరీ ఉద్ధృతంగా ప్రవహించింది. మొత్తం నగరాన్ని చుట్టుముట్టింది. సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇవాళ ఉదయం నాటికి (జులై 16) యమునా నది నీటి మట్టం 206.14 మీటర్లకు చేరుకుంది. ఈ వరద ముంచెత్తడం వల్ల రాజ్‌ఘాట్ మార్గం అంతా నీళ్లు నిలిచిపోయాయి.
#WATCH | Delhi's Rajghat remains waterlogged following rise in water level of Yamuna River. pic.twitter.com/JNsKStJ0Li
— ANI (@ANI) July 16, 2023
మయూర్ విహార్ కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడి ప్రజలందరినీ రిలీఫ్ క్యాంప్‌లకు తరలించారు. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని అనుకునే లోపే మళ్లీ వరద నీరు వచ్చి చేరుతుండటం వల్ల ఆందోళన చెందుతున్నారు.
#WATCH | Delhi | Drone visuals of Mayur Vihar area. The area has been heavily flooded due to the rising water level of the Yamuna River. pic.twitter.com/gAZaqn16rh
— ANI (@ANI) July 16, 2023
లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా యమునా బజార్‌లో పర్యటించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నీళ్లు అలాగే నిలిచిపోయాయి. శనివారం (జులై 15) ఢిల్లీలో మరోసారి భారీ వర్షాలు కురిశాయి. అసలే వరదలతో సతమతం అవుతున్న నగరాన్ని మరింత ముంచేశాయి ఈ వానలు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.
#WATCH | Severe waterlogging in Delhi's Yamuna Bazar due to rise in water level of Yamuna River. pic.twitter.com/bhitGUTuLx
— ANI (@ANI) July 16, 2023
రాజకీయ రచ్చ..
ఢిల్లీలో ఓ వైపు భారీ వర్షాలు కురిసి వాతావరణమంతా చల్లబడితే...రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. దేశ రాజధానిని ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడానికి (Delhi Rains) కారణం బీజేపీయే అని ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. కుట్రపూరితంగానే హరియాణా ప్రభుత్వంతో కుమ్మక్కై ఢిల్లీలోకి వరదలు వదిలారని విమర్శించింది. నియంత్రించే అవకాశం లేకుండా భారీ స్థాయిలో నీళ్లు వదిలారని ఆప్ మంత్రులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే కేంద్రహోం మంత్రి అమిత్‌షాకి లేఖ రాశారు. హరియాణాలోని హత్నికుండ్ బ్యారేజ్ (Hathnikund barrage) నుంచి వరద నీటిని వేగంగా కాకుండా కాస్త నెమ్మదిగా వదలాలని కోరారు. అయితే...దీనిపై హరియాణా మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఆప్ చేసే ఆరోపణలను ఖండించారు. బ్యారేజ్ నుంచి నీళ్లు వదలడం తప్ప వేరే ఆప్షన్ లేదని తేల్చి చెప్పారు. ఎక్కువ నీళ్లు అలాగే ఉంచితే బ్యారేజ్ ధ్వంసమయ్యే ప్రమాదముందని అందుకే వదలాల్సి వచ్చిందని వివరించారు. ఎక్కువ మొత్తంలో నీరు నిల్వ ఉంచడానికి ఇది రిజర్వాయర్ కాదని స్పష్టం చేశారు.
Also Read: Monsoon 2023 Deaths: 624 మందిని బలి తీసుకున్న వానలు, అత్యధికంగా ఆ రాష్ట్రంలోనే