(Source: ECI/ABP News/ABP Majha)
మనీష్ సిసోడియా కస్టడీ జూన్ 1 వరకు పొడిగింపు - మెడ పట్టుకొని కోర్టుకు లాక్కెళ్లడంపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ పోలీసులు మనీష్ సిసోడియా మెడ పట్టుకుని కోర్టుకు తీసుకెళ్లారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అలా చేయాలని పై నుంచి ఆదేశాలు వచ్చాయా అని ప్రశ్నించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాను కోర్టుకు తరలించారు. ఈ సమయంలో పోలీసులు మనీష్ సిసోడియా మెడను పట్టుకుని తీసుకెళ్లడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోలీసు చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేజ్రీవాల్.
మనీష్ సిసోడియా పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
क्या पुलिस को इस तरह मनीष जी के साथ दुर्व्यवहार करने का अधिकार है? क्या पुलिस को ऐसा करने के लिए ऊपर से कहा गया है? https://t.co/izPacU6SHI
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 23, 2023
ఢిల్లీ పోలీసులు వెంటనే ఈ పోలీసును సస్పెండ్ చేయాలి
ఈ క్లిప్ ను అతిషి ఖాతా నుంచి సిఎం కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన అతిషి, "రౌస్ అవెన్యూ కోర్టులో మనీష్ జీతో పోలీసు అసభ్యంగా ప్రవర్తించాడు. ఢిల్లీ పోలీసులు ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి. అని రిక్వస్ట్ చేశారు.
SHAME ON DELHI POLICE & NARENDRA MODI
— AAP (@AamAadmiParty) May 23, 2023
दिल्ली पुलिस की Manish Sisodia जी के साथ ऐसा दुर्व्यवहार करने की हिम्मत कैसे हुई?
मोदी जी आपकी तानाशाही पूरा देश देख रहा है। pic.twitter.com/VyjMRLAyAN
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. తన సెల్‌లో కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించింది కోర్టు.