అన్వేషించండి

Covid-19 in India: మరో 2 వారాల పాటు పెరగనున్న కరోనా వ్యాప్తి, తరువాత ఎండెమిక్ దశకు కోవిడ్

త్వరలోనే కొవిడ్ 19 ఎండెమిక్ దశకు చేరుకుంటుందని వైద్య నిపుణులు బుధవారం తెలిపారు. కొన్ని ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి ఉంటుందన్నారు.

Corona Virus In India: దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ మళ్లీ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో యాక్టివ్ కేసులు భారీగా పెరిగాయి. అయితే ఒమిక్రాన్ లాంటి వేరియంట్ల కేసులు నమోదవుతున్నప్పటికీ, కొన్ని రోజుల్లో కరోనా తగ్గుముఖం పడుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే కొవిడ్ 19 ఎండెమిక్ దశకు చేరుకుంటుందని వైద్య నిపుణులు బుధవారం తెలిపారు. కొన్ని ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి ఉంటుందన్నారు.

మరో 10 నుంచి 12 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో రెండు వారాల తరువాత దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చాలా మేరకు తగ్గుతుందని వైద్య నిపుణులు వెల్లడించడం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 వేరియంట్‌ ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణం అన్నారు. కరోనా వ్యాప్తి వేగంగా జరిగి, కేసులు భారీగా నమోదవుతున్నా ఆందోళన అవసరం లేదన్నారు. ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయని పేర్కొన్నారు.  

కొత్తగా 2,14,242 మందికి పరీక్షలు నిర్వ‌హించ‌గా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ (ministry of health) బుధవారం వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒకేరోజు 7,946 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మ‌ళ్లీ 223 రోజుల త‌ర్వాత ఆ స్థాయిలో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 40,215 కు పెరిగింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో 16 మంది మ‌ర‌ణించ‌గా మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య‌ 5,31,016 కు పెరిగింది.

ఢిల్లీ, పంజాబ్, హిమాచల్‌ప్ర‌దేశ్ రాష్ట్రాలలో ఇద్ద‌రు చొప్పున‌, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కరు క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. కేర‌ళ‌లో ఐదు వైరస్ సంబంధిత మరణాలు న‌మోదయ్యాయి. మొత్తంగా 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగ‌ళ‌వారం 5,676 న‌మోద‌వ‌గా, బుధ‌వారం 7,830 కేసులు న‌మోదు కావ‌డంతో భారీ పెరుగుద‌ల క‌నిపించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,47,76,002కి చేరుకుంది.

గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒకేరోజు 7,946 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మ‌ళ్లీ సుమారు 7 నెల‌ల త‌ర్వాత ఆ స్థాయిలో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. XBB1.16 వేరియంట్‌కు సంబంధించిన 1,774 కేసులు 22 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో గుర్తించారు. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) డేటా ప్రకారం, వైర‌స్‌ సోకిన వారిలో 230 మందికి పైగా Omicron వేరియంట్‌కు చెందిన సబ్-వేరియంట్ XBB1.16.1 బారిన పడ్డారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పుడు మొత్తం యాక్టివ్ కేసులు 0.09 శాతం ఉన్నాయి, అయితే జాతీయ COVID-19 రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

ఎండెమిక్‌ దశ అంటే..
కరోనా లాంటి ఏదైనా వ్యాధులు తక్కువ సమయంలో ఎక్కువ నమోదు కావడం, మరణాలు సంభవిస్తే పాండమిక్ లేదా మహమ్మారి అని ప్రకటిస్తారు. కొంతకాలానికి వ్యాప్తి తగ్గుతుంది. ఈ సమయంలో కేవలం కొన్ని ప్రాంతాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కేసులు నమోదైనా ప్రాణ నష్టం సైతం అతి తక్కువగా ఉండే ఈ స్థితిని ఎండెమిక్ స్టేజీ అంటారు. డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, లాంటి వ్యాధులు త్వరగా వ్యాప్తి చెంది చివరకు ఎండెమిక్‌ వ్యాధులుగా గుర్తించారు.

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget