COVID Insurance: మీరు ఈ ఉద్యోగంలో ఉన్నారా? కేంద్రం తీపి కబురు.. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ మీ సొంతం
కరోనా వేళ గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ గురించి అవగాహన కల్పించడం, ఆయా ప్రాంతాల్లో ప్రతి ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే చేయడం వంటి కార్యక్రమాల్లో అంగన్ వాడీ ఉద్యోగులు విశేషమైన సేవలు అందించారు.
![COVID Insurance: మీరు ఈ ఉద్యోగంలో ఉన్నారా? కేంద్రం తీపి కబురు.. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ మీ సొంతం COVID insurance scheme: Anganwadi workers, helpers involved in Covid duty get Rs 50 Lakh insurance coverage COVID Insurance: మీరు ఈ ఉద్యోగంలో ఉన్నారా? కేంద్రం తీపి కబురు.. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ మీ సొంతం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/09/50522bde25c9a85ccb5094ed2c29eda9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కరోనా సమయంలో లాక్ డౌన్ విధించిన వేళ వైరస్ ను సైతం లెక్క చేయకుండా శ్రమించిన అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొవిడ్ వేళ ప్రాణాలకు తెగించి వారు చేసిన సేవలకు గానూ రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ను వర్తింపజేయనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద ఈ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లుగా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు జాతీయ మీడియాతో వెల్లడించారు.
కరోనా వేళ గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ గురించి అవగాహన కల్పించడం, ఆయా ప్రాంతాల్లో ప్రతి ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే చేయడం వంటి కార్యక్రమాల్లో అంగన్ వాడీ ఉద్యోగులు విశేషమైన సేవలు అందించారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే లాక్ డౌన్ వేళ రేషన్ సరకులను ఇంటింటికీ వెళ్లి అంగన్ వాడీ ఉద్యోగులే అందించారు.
Also Read: కేటీఆర్ బినామీనని నమ్మించాడు.. కోట్లు కొల్లగొట్టాడు ! జగిత్యాలలో మహా మోసగాడు !
‘‘అంగన్ వాడీ వర్కర్లు, సహాయకులు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని పొందుతారు. కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ బీమా సౌకర్యం కింద కరోనాకు సంబంధించిన డ్యూటీలో ఉండి ఆ జబ్బుతో చనిపోతే రూ.50 లక్షల సొమ్ము కుటుంబానికి వస్తుంది. దేశంలో అంగన్ వాడీ వర్కర్లు దాదాపు 13.29 లక్షల మంది వరకూ ఉన్నారు. అంగన్ వాడీ సహాయకులు 11.79 లక్షల మంది వరరకూ ఉన్నారు.’’ అని కేంద్ర శిశు సంక్షేమ శాఖలోని సీనియర్ అధికారి వెల్లడించారు.
అయితే, ఈ బీమా సౌకర్యానికి అర్హులయ్యే అంగన్ వాడీ ఉద్యోగులు, సహాయకులను గుర్తించే పనిని జిల్లా అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అన్ని రాష్ట్రాలకు ఇచ్చామని అధికారి వివరించారు. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు సాయం అందుతుందని వివరించారు.
అంతకుముందు వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ప్రజా ఆరోగ్య సిబ్బంది, కరోనా పేషెంట్లకు నేరుగా సేవలు చేసే వైద్య సిబ్బంది సహా ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి గతంలోనే ఈ రకం బీమా సౌకర్యాన్ని కల్పించారు.
Also Read: 30గంటల నిర్బంధం తర్వాత ప్రియాంకా గాంధీ అరెస్ట్ - యూపీ ఘటనపై దేశవ్యాప్త నిరసనలు !
Also Read: అక్కడ బంగారం పెట్టుకుని తరలించాలనుకున్నారు.. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)