నేషనల్ జియోగ్రాఫిక్‌లో చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ లైవ్
చంద్రయాన్-3 తుది దశ ప్రక్రియను ఈ సాయంత్రం 4 గంటల నుంచి లైవ్‌లో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌లో ప్రారంభమవుతుంది. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో 5.45 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
చంద్రయాన్ -3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇండియానే కాదు యావత్ ప్రపంచమే ఆసక్తిగా చూస్తోంది. ఇలాంటి చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలకు పూర్తి ఎనాలసిస్‌తో అందించేందుకు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ సిద్ధమైంది. 130 ఏళ్ల అనుభవం, వైవిధ్యమైన స్టోరీ టెల్లింగ్, విషయాన్ని మూలల్లోకి వెళ్లి సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా చెప్పే సత్తా ఉన్న నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ మరో బృహత్ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుంది.
ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. అలాంటి కోణాలన్నింటీనీ స్పృసిస్తూ విషయాన్ని వైవిధ్యంగా అందంగా చెప్పగలదు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్. 2019లో చంద్రయాన్-2 ప్రయోగం సమయంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా హ్యండిల్ చేసింది. ఇప్పుడు చంద్రయాన్ -3ని కూడా మరింత డిటేల్డ్‌గా ప్రజలకు చూపించేందుకు సిద్ధమైంది. #countdowntohistory హ్యాష్ ట్యాగ్ ద్వారా ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రచారాన్ని మొదలు పెట్టింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ తోడుగా ఉంటోంది. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లో చంద్రయాన్ - 3 సాఫ్ట్ ల్యాండిగ్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు.
చంద్రయాన్-3 తుది దశ ప్రక్రియను ఈ సాయంత్రం 4 గంటల నుంచి లైవ్‌లో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌లో ప్రారంభమవుతుంది. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో 5.45 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అంత కంటే ముందు నుంచే నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చూడవచ్చు. గౌరవ్ కపూర్ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తారు. ఆయనతోపాటు ప్రముఖ అంతరిక్ష నిపుణులు కూడా వచ్చి తమ అభిప్రాయాలు, చంద్రయాన్-3 విజయంతో చేకూరే ప్రయోజనాలు సహా ఆసక్తికరమైన చాలా ఆంశాలు పంచుకోనున్నారు.
యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ కొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమవుతున్న భారతదేశం కృషిని, చంద్రయాన్-3 విజయోత్సవంలో ప్రేక్షకులను భాగస్వాములను చేసేందుకు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ సిద్ధమైంది.
వ్యోమగాములు సునీతా విలియమ్స్, రాకేష్ శర్మ, ఇస్రో ఛైర్మన్ S. సోమనాథ్ వంటి ప్రముఖ వ్యక్తులతో మాట్లాడి చంద్రయాన్ మిషన్ ప్రాముఖ్యత, అంతరిక్ష పరిశోధన భవిష్యత్తు గురించి చర్చించనున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చేరిన ఏపీజే అబ్దుల్ కలామ్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సృజన్ పాల్ సింగ్; అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాజీ కమాండర్ క్రిస్ హాడ్‌ఫీల్డ్, నాసా వాయేజర్ ఇంటర్‌స్టెల్లార్ మెసేజ్ క్రియేటివ్ డైరెక్టర్ ఆన్ డ్రూయాన్ కూడా లైవ్‌లోకి వస్తారు. తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
అంతరిక్ష పరిశోధనల్లో తమ వంతు పాత్ర పోషించి ఎన్నో విజయాల్లో పాలుపంచుకున్న ప్రముఖ శాస్త్రవేత్తలు లైవ్ డిస్కషన్‌లోకి రానున్నారు. చంద్రునిపై జరుగుతున్న పరిశోధనల్లో కొత్త శకానికి నాందిపలుకుతున్న భారత్ చేపట్టే కార్యక్రమానికి కౌంట్‌డౌన్‌లో పాత్ర పోషించనున్నారు. రాకెట్ సైన్స్‌లో ఉన్న గుట్టును, చంద్రయాన్-3లో ఉపయోగించిన సాంకేతికతను, భవిష్యత్ ఏఆర్ వీఆర్ గ్రాఫిక్స్ ఇలా ఆసక్తికరమైన విషయాలను డీ కోట్ చేయబోతోంది నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్.
ఈ కార్యక్రమంలో విక్రమ్ సారాభాయ్, ఆయన చేపట్టిన ఆవిష్కరణలు, ఇస్రో దార్శనిక నాయకుడిగా సతీష్ ధావన్, డాక్టర్ కలాంపై రూపొందించిన వీడియోలను కూడా ప్రదర్శిస్తారు.
2019లో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌లో చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ లైవ్‌ను కోట్ల మంది వీక్షించారు. చంద్రునిపై ప్రయోగంలో వేసిన తొలి అడుగు విజయవంతం కావాలన్న యావత్ దేశం ఆకాంక్షను ప్రజలకూ చూపించి అందర్నీ ఒక్కచోట చేర్చింది. ఇప్పుడు మరోసారి చంద్రయాన్ 3 విజయం కోసం దేశమే కాదు ప్రపంచమే ప్రార్థిస్తోంది. అపజయాల నుంచి విజయం దిశగా పయనిస్తున్న ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతం అవ్వాలని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ జరగాలని కోరుకుంటున్నారు.
ఇలాంటి అరుదైన ఘట్టాన్ని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, డిస్నీ + హాట్‌స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అంతే కాదు భారతదేశం ఖ్యాతి చంద్రునిపై ఎగరాలని ప్రపంచమే మెచ్చేలా చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ కావాలని, ఇస్రో శాస్త్రవేత్తలకు, అక్కడి సిబ్బందికి వారి ఫ్యామిలీస్‌కు మనసారా సెల్యూట్ చేస్తూ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది.
ప్రామాణికమైన, విశ్వసనీయమైన స్టోరీలు ప్రజలకు అందివ్వడం మాకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. ముఖ్యంగా సైన్స్, పరిశోధన రంగాల్లో ఇచ్చే స్టోరీలు మమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తాయి. అద్భుతమైన స్టోరీ టెల్లింగ్‌ను వారసత్వంగా కొనసాగిస్తూనే ప్రేక్షకులను థ్రిల్ చేసే కథనాలు అందిస్తున్నాం. వారిలో అవగాహన కలిగించే కథనాలు ఇస్తున్నాం. చుట్టూ ఉండే ప్రపంచం జరిగే అంశాలను పూసగుచ్చి చెబుతున్నాం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే #countdowntohistory కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఏకం చేయాలని చూస్తున్నాం. దీనికి ఫ్యూచరిస్టిక్ 3డి గ్రాఫిక్స్, ఇండియాలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండే ప్రముఖల అభిప్రాయాలను కూడా అందివ్వబోతున్నాం. మొత్తంగా కార్యక్రమం చూసే ప్రేక్షకులకు ఒక చిరస్మరణీయమైన గుర్తుండిపోయే అనుభవాన్ని అందిస్తాం" అని డిస్నీ+ హాట్‌స్టార్ HSM ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్, డిస్నీ స్టార్ కంటెంట్ హెడ్ గౌరవ్ బెనర్జీ అన్నారు.
View this post on Instagram
“గత 40 సంవత్సరాలలో పరిమిత వనరులు ఉన్నప్పటికీ ఇస్రో అద్భుతమైన ప్రయాణం చేసింది. మేము నిర్వహించిన కార్యక్రమాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అంతరిక్ష పరిశోధనల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి, కానీ మేము మా విధానంపై దృష్టి కేంద్రీకరించాము. ఇస్రో పనితీరు తెలుసు. కచ్చితంగా చంద్రయాన్ 3 సురక్షితంగా ల్యాండింగ్ అవుతుందని నేను గర్వంగా చెప్పగలను. చంద్రుని ల్యాండింగ్ విజయం కోసం నేను ఎదురు చూస్తున్నాను” అని అంతరిక్షంలో అడుగు పెట్టిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ అన్నారు.
We salute the brave dreamers of the Indian Space Research Organisation.
— Nat Geo India (@NatGeoIndia) August 21, 2023
Watch India’s historic touchdown, Chandrayaan 3 Live #countdowntohistory on 23 August at 4 pm on National Geographic and Disney Plus Hotstar. #Chandrayaan3 #ISRO #ch3 #Chandrayaan_3@isro @chandrayaan_3 pic.twitter.com/rA888B0eIy