Watch: ప్లాట్‌ఫామ్‌పై పడుకున్నారని మొహంపై నీళ్లు పోసిన పోలీస్, నెటిజన్లు ఫైర్ - వైరల్ వీడియో
Watch Video: పుణె రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న వాళ్లపై పోలీస్ నీళ్లు పోసిన వీడియో వైరల్ అవుతోంది.
Watch Video:
పుణె రైల్వే స్టేషన్‌లో ఘటన..
పుణె రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న వాళ్లపై ఓ పోలీస్ వాటర్ బాటిల్‌తో నీళ్లు పోసిన వీడియో వైరల్ అవుతోంది. ట్విటర్‌లో ఓ యూజర్ దీన్ని షేర్ చేశాడు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP)కి చెందిన ఓ పోలీస్ వాటర్ బాటిల్‌తో అందరి ముఖంపై నీళ్లు కొట్టాడు. దీనిపై నెటిజన్లు మండి పడ్డారు. "మానవత్వమే లేదా.." అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో పుణె డివిజనల్ రైల్వే మేనజర్ వరకూ వెళ్లింది. ఇది చూసిన వెంటనే ఆయన అసహనానికి లోనయ్యారు. ఇలా జరగడం పట్ల ఆమె క్షమాపణలు చెప్పారు.
RIP Humanity 🥺🥺
— 🇮🇳 Rupen Chowdhury 🚩 (@rupen_chowdhury) June 30, 2023
Pune Railway Station pic.twitter.com/M9VwSNH0zn
"ప్లాట్‌ఫామ్‌పై అలా పడుకోవడం వల్ల మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అయినా సరే వాళ్లతో వ్యవహరించాల్సిన తీరు అది కాదు. మిస్ హ్యాండిల్ చేశారు. అనుచితంగా ప్రవర్తించిన ఆ పోలీస్‌ని మందలించాం. ప్యాసింజర్స్‌తో మర్యాదగా నడుచుకోవాలని చెప్పాం. ఇలా జరగడం చాలా బాధాకరం"
- ఇందూ దూబే, పుణె డివిజనల్ రైల్వే మేనేజర్
Sleeping on the Platform causes inconvenience to others however the way it was handled is not a suitable way of counseling passengers. Concerned staff has been suitably advised to deal with passengers with dignity, politeness & decency. This incident is deeply regretted.
— Smt. Indu Dubey (@drmpune) June 30, 2023
ఇప్పటికే ఈ వీడియోకి 20 లక్షల వ్యూస్ రాగా..11 వేల లైక్స్ వచ్చాయి. కామెంట్స్ సెక్షన్ అయితే మారుమోగి పోతోంది. కొంత మంది ఈ వీడియోని రీట్వీట్ చేస్తూ ఉన్నతాధికారులనూ ట్యాగ్ చేశారు.
"వెయిటింగ్ రూమ్స్ సంఖ్య పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అదే జరిగితే ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పై పడుకోవాల్సిన దుస్థితి ఉండదు. అంతే కాదు. రైళ్లు కూడా సమయానికి రావాలి"
- ఓ నెటిజన్ కామెంట్
Also Read: Gas Cylinder Price: ఈ నెలలోనూ 'బండ' భారం భరించాల్సిందే - వంట గ్యాస్ కొత్త రేట్లివి